Begin typing your search above and press return to search.
అక్షయ్ ‘బెల్ బాటమ్’.. వెరీ ‘స్పై’సీ అంటున్న హీరోయిన్లు!
By: Tupaki Desk | 25 Jun 2021 5:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ జోరు గురించి తెలిసిందే. ఎప్పుడూ జోష్ గా కనిపించే ఈ హీరో.. సినిమాల్లోనూ ఇదే జోరు చూపిస్తుంటాడు. టాప్ స్టార్ గా కొనసాగుతూనే.. మిగిలిన అగ్రహీరోలకు సాధ్యం కాని రీతిలో ఏడాదికి రెండు మూడు సినిమాలను రిలీజ్ చేస్తుంటాడు. కరోనా కారణంగా చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో పడిపోయాయిగానీ.. లేదంటే ఇప్పటికే మూడున్నాలుగు సినిమాలు థియేటర్లో సందడి చేసేవి.
అక్షయ్ కుమార్ కిట్లో ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయి. ఈ మూవీస్ లో కొన్ని సెట్స్ మీద ఉండగా.. మరికొన్ని ప్రారంభం దశలో, కొన్ని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో.. బెల్ బాటమ్, పృథ్వీరాజ్, అట్రాంగి రే, బచ్చన్ పాండే, ఇంకా ‘రామ్ సేతు’ సినిమాలున్నాయి. ఈ ఐదు చిత్రాలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి 2022 పూర్తయ్యేలోగా రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు.
ఇందులో మొదటగా ‘బెల్ బాటమ్’ రాబోతోంది. స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. 80వ దశకంలో భారత్ లో అలజడి సృష్టించిన విమానం హైజాక్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. రంజిత్ తివారీ రూపొందించిన ఈ చిత్రంలో.. వాణి కపూర్, హుమా ఖురేషి, లారా దత్త హీరోయిన్లుగా నటించారు.
ఈ మూవీని జులై 27న రిలీజ్ చేసేందుకు స్లాట్ బుక్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో ముందస్తుగా ప్రివ్యూ వేశారు మేకర్స్. ఈ మూవీని వీక్షించడానికి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. హీరో అక్షయ్ కుమార్ తోపాటు హీరోయిన్లు వాణి కపూర్, హుమా ఖురేషి, లారా దత్తా హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ డామ్ షూర్ గా సక్సెస్ సాధిస్తుందన్నట్టుగా విక్టరీ సింబల్ చూపిస్తున్నారీ భామలు.