Begin typing your search above and press return to search.
కోటి విరాళం ఇచ్చిన సూపర్ స్టార్
By: Tupaki Desk | 26 April 2021 11:03 AM ISTకరోనా విపత్తు సమయంలో సినీ ప్రముఖులు వారి సామర్థ్యం మేరకు విరాళం ఇస్తున్న విషయం తెల్సిందే. గత ఏడాది ప్రభుత్వానికి స్వచ్చంద సంస్థలకు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడం జరిగింది. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కోటి రూపాయల విరాళంను ఇచ్చి మరో సారి వార్తల్లో నిలిచాడు. మాజీ క్రికెటర్ ప్రస్తుతం ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో ఒక చారిటబుల్ ట్రస్ట్ రన్ అవుతోంది. కరోనా నేపథ్యంలో ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను గంభీర్ నిర్వహిస్తున్నాడు. ఈ సందర్బంగా ఆయన విరాళాలను ఆహ్వానించడంతో అక్షయ్ కుమార్ ఏకంగా కోటి విరాళంను ఇవ్వడం జరిగిందట.
అక్షయ్ కుమార్ విరాళం ఇచ్చిన విషయాన్ని స్వయంగా గౌతమ్ గంభీర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ప్రతి ఒక్కరి సాయం ఆపదలో ఉన్న వారికి ఆశను కలుగజేస్తుంది. అక్షయ్ కుమార్ కోటి విరాళంను ఇచ్చారు. కరోనా పేషంట్స్ ఆక్సీజన్ మరియు ఫుడ్ కోసం ఆయన ఈ విరాళంను ఇచ్చినట్లుగా గంభీర్ పేర్కొన్నాడు. గంభీర్ ట్వీట్ కు అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. ప్రస్తుతం చాలా విపత్కర పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో గౌతమ్ గంభీర్ చేస్తున్న సేవ అభినందనీయం. నా వంతు నేను సాయం చేసేందుకు ముందుకు వచ్చానంటూ అక్షయ్ చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న అక్షయ్ కుమార్ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు విడుదల చేస్తూ నెం.1 హీరోగా దూసుకు పోతున్నాడు. పెద్ద ఎత్తున పారితోషికం అందుకోవడంతో పాటు ఎక్కువ సక్సెస్ రేటును కలిగి ఉన్న హీరోగా కూడా అక్షయ్ కుమార్ పేరు దక్కించుకున్నాడు. అక్షయ్ కుమార్ ఈ మహమ్మారి సమయంలో తనవంతు సాయం ఎప్పటికప్పుడు అందిస్తూ అందరి ప్రశంసలు దక్కించుకుంటూనే ఉన్నాడు.