Begin typing your search above and press return to search.

కమెడియన్‌ సంపాదనపై కామెంట్స్‌ చేసిన సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   31 Oct 2020 12:30 AM GMT
కమెడియన్‌ సంపాదనపై కామెంట్స్‌ చేసిన సూపర్‌ స్టార్‌
X
బాలీవుడ్‌ లో ఖాన్స్‌ త్రయం జోరుకు గండి పడింది. దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఈ ఖాన్‌ త్రయంను బీట్‌ చేయగలిగిన హీరో రాలేదు. ఎట్టకేలకు వారిని మించిన సంపాదన సక్సెస్‌ ను దక్కించుకుంటూ బాలీవుడ్‌ నెం.1 హీరోగా అక్షయ్‌ కుమార్‌ నిలిచాడు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలను విడుదల చేస్తూ అత్యధిక సక్సెస్‌ రేటు మరియు అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా అక్షయ్‌ నిలిచాడు. ఈయన తాజాగా నటించిన లక్ష్మి సినిమా ఓటీటీ విడుదల సందర్బంగా ప్రమోషన్‌ కార్యక్రమాల నిమిత్తం ది కపిల్‌ శర్మ కామెడీ షో కు హాజరు అయ్యాడు.

ఉత్తరాదిన టాప్‌ టాక్‌ షో అయిన ది కపిల్‌ శర్మ కామెడీ షో లో అక్షయ్‌ పాల్గొన్నాడు. ఆ సందర్బంగా అక్షయ్‌ మరియు కపిల్‌ శర్మల మద్య ఆసక్తికర చర్చ జరిగింది. కపిల్‌ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరో. సినిమాలతోనే కాకుండా బ్రాండ్‌ అంబాసిడర్‌ గా కూడా బిజీ బిజీగా ఉంటున్నాడు. ఈమద్యే నా వద్ద ఉన్న ఒక బ్రాండ్‌ ను కూడా ఆయన లాగేసుకున్నాడు అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు. అందుకు అక్షయ్‌ స్పందిస్తూ గతంలో నువ్వు చేసిన ఒక యాడ్‌ నాకు వచ్చింది. అయితే కపిల్‌ ఈ షో ద్వారా సంపాదిస్తున్నంత మరెవ్వరు సంపాదించలేరు. కొన్నాళ్ల క్రితం కపిల్‌ ఇంటికి వెళ్లాను. నా ఇంటి కంటే చాలా పెద్దగా ఉన్న ఆ ఇల్లును చూసి ఆశ్చర్యపోయాను అంటూ అక్షయ్‌ మరింత ఫన్నీగా ఆ సంభాషణను మార్చాడు.