Begin typing your search above and press return to search.
ఆ స్టార్ హీరో మూవీ ఓటీటీలోనే.. డేట్ కూడా ఫిక్స్..!
By: Tupaki Desk | 21 Jan 2021 7:00 PM ISTఎంత నష్టం వచ్చినా సరే.. బిగ్ స్క్రీన్లోనే బొమ్మ పడాలంటూ సినిమాలు స్టోర్ రూమ్ లో ఉంచారు చాలా మంది నిర్మాతలు. కొందరు ప్రొడ్యూసర్లు ఓటీటీ వైపు చూసినా.. థియేటర్ వైపే వేలు చూపించారు హీరోలు. ఆ విధంగా ఏడాది కాలంగా వెయిట్ చేస్తున్న సినిమాలు ఇప్పుడు టాకీసుల్లో సందడి చేస్తున్నాయి. ఇలాంటి టైంలో తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్!
బీటౌన్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు ‘అక్షయ్ కుమార్’. శరవేగంగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. అయితే.. ఆయన గత చిత్రం ‘లక్ష్మి’ మాత్రం పరాజయాన్ని చవిచూసింది. ‘కాంచన’ మూవీని రీమేక్ చేసిన లారెన్స్.. సక్సెస్ ను రిపీట్ చేయలేకపోయాడు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫాంలోనే రిలీజ్ అయ్యింది.
అయితే.. ఇప్పుడు రాబోతున్న మూవీని కూడా ఓటీటీలోనే వదలబోతున్నాడు అక్షయ్. అదే ‘బెల్ బాటమ్’. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీకి రంజిత్ తివారి దర్శకుడు. అయితే.. థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకుని, సినిమాలన్నీ క్యూ కడుతున్న ఈ దశలో.. ‘బెల్ బాటమ్’ను ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తుండడం గమనార్హం.
ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌తో చర్చలు జరపుతున్నారు. ఈ చర్చలు గనక సక్సెస్ అయితే.. ఈ సినిమా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కానుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. అమెజాన్ ఇచ్చిన ఆఫర్‌కు నిర్మాతలు టెంప్ట్ అయ్యారట. అయితే.. ఆ మొత్తం ఇంకాస్త పెరిగితే బాగుంటుందని ఆశిస్తున్నారట.
ఈ విషయంపై వచ్చే నెలలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. రిలీజ్ ఏ ప్లాట్ ఫాం అయినా.. ఏప్రిల్2న సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారట. మరి, ఏం జరుగుతుంది? ‘బెల్ బాటమ్’ ఎప్పుడు, ఎక్కడ విడుదలవుతుంది? అన్నది చూడాలి.