Begin typing your search above and press return to search.

వీడియో : హీరోయిన్‌ తో సూపర్ స్టార్‌ బెలూన్ రొమాన్స్‌

By:  Tupaki Desk   |   31 Oct 2021 2:30 AM GMT
వీడియో : హీరోయిన్‌ తో సూపర్ స్టార్‌ బెలూన్ రొమాన్స్‌
X
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్ కుమార్‌ హీరోగా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఒక వైపు ఈయన నటించిన రెండు మూడు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉండగా మరో వైపు ఈయన కొత్తగా రెండు మూడు సినిమాలను మొదలు పెడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం మోస్ట్‌ క్రేజీ మూవీ 'రామసేతు' సినిమా షూటింగ్‌ లో అక్షయ్‌ కుమార్‌ పాల్గొంటున్నాడు. ఈ షూటింగ్‌ లో భాగంగా అక్షయ్‌ కుమార్‌ హీరోయిన్ తో చేసిన రొమాన్స్ ను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశాడు. రామసేతులో అక్షయ్‌ కు జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరి మద్య ఆసక్తికర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే చెప్పుకొచ్చారు. ఈ సమయంలో అక్షయ్‌ ఈ వీడియోను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.

అక్షయ్‌ రెగ్యులర్ లుక్ లో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కు ప్రపోజ్‌ చేస్తున్నట్లుగా మోకాళ్ల మీద కూర్చుని హార్ట్‌ బెలూన్ ను ఆమెకు ఇచ్చి ప్రపోజ్‌ చేస్తాడు. అందుకు ఆమె ఒప్పుకుని హార్ట్‌ బెలూన్ ను తీసుకుంటుంది. ఆ బెలన్ ను ఇద్దరి మద్యలో పెట్టుకుని ఉంటారు. ఆ సమయంలో బెలూన్‌ బ్లాస్ట్‌ అవుతుంది. దాంతో వెంటనే ఇద్దరు కూడా ఒక్క దగ్గరికి అయ్యారు. కాస్త షాక్‌ అయినట్లుగా ఉన్న వారు నవ్వుకుంటూ కౌగిలించుకున్నారు. ఈ వీడియోను అక్షయ్‌ కుమార్‌ ఇన్ స్టాలో షేర్‌ చేయడం జరింది. దాంతో పాటు అక్షయ్‌ నేను జాక్వెలిన్‌ బెలూన్‌ ను ఎంత రొమాంటిక్ గా పగులకొట్టామో అన్నట్లుగా కామెంట్ పెట్టాడు. ఈ వీడియో సినిమాకు సంబంధించింది అయ్యి ఉండదు.. మరి ఎందుకు అక్షయ్‌ ఈ వీడియో షేర్‌ చేశాడా అంటూ అంతా జుట్టు పీక్కుంటున్నారు.

ఇక అక్షయ్‌ కుమార్‌ సినిమాల విషయానికి వస్తే అతి త్వరలోనే మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ సూర్య వంశీ విడుదలకు సిద్దం గా ఉంది. భారీ అంచనాల నడుమ రూపొందిన సూర్య వంశీ సినిమా ను పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా మొదటి మరియు రెండవ వేవ్‌ తర్వాత భారత దేశంలో విడుదల కాబోతున్న పెద్ద సినిమా ఇదే అవ్వడం వల్ల అంచనాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ సినిమా ఫలితాన్ని బట్టి బాలీవుడ్‌ నుండి వరుసగా సినిమాలు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తేనే.. థియేటర్లకు జనాలు వస్తారని ఆశ కలిగితేనే జక్కన్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.