Begin typing your search above and press return to search.

ఉదయ్ కిరణ్ హీరోయిన్ దర్శకత్వంలో అక్షయ్

By:  Tupaki Desk   |   28 Jun 2016 7:00 PM IST
ఉదయ్ కిరణ్ హీరోయిన్ దర్శకత్వంలో అక్షయ్
X
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ తన ప్రభను కోల్పోతున్న సమయంలో ‘లవ్ టుడే’ అనే సినిమా ఒకటి చేశాడు గుర్తుందా..? అట్టర్ ఫ్లాప్ అయిన ఆ సినిమాలో దివ్య ఖోస్లా అనే ముంబయి అమ్మాయి హీరోయిన్ గా నటించింది. మంచి అందగత్తె.. ప్రతిభావంతురాలే అయినా.. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా రిజిస్టర్ కాలేకపోయింది ఈ భామ. తెలుగులో ఆ ఒక్క సినిమా చేశాక.. తిరిగి బాలీవుడ్ కు వెళ్లిపోయి.. అక్కడ ఒకటీ అరా సినిమాలు చేసింది. హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినా భూషణ్ కుమార్ అనే ప్రముఖ నిర్మాతను పెళ్లాడి లైఫ్ లో సెటిలైపోయింది దివ్య.

ఐతే పెళ్లయ్యాక హీరోయిన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పేసిందికానీ.. ఆశ్చర్యకరంగా దర్శకత్వం మీద ఫోకస్ పెట్టింది. ఆమె దర్శకత్వంలో భూషణ్ కుమార్ నిర్మించిన యారియాన్.. సనమ్ రే సినిమాలు బాగానే ఆడాయి. విమర్శకులు ఈ సినిమాలపై పెదవి విరిచినా.. అవి రెండూ కూడా కమర్షియల్ గా మంచి విజయమే సాధించాయి. ఈ రెండు సినిమాలిచ్చిన ఊపుతో ఈసారి ఓ బడా స్టార్ తో సినిమా చేయడానికి రెడీ అవుతోంది దివ్య. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కోసం ఆమె ఓ స్క్రిప్టు రెడీ చేస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని కూడా భూషణ్ కుమారే నిర్మిస్తాడు. అక్షయ్ కుమార్ కెరీర్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందట. ఈ సినిమా కోసం అక్షయ్ చాలా కాల్ షీట్లు ఇవ్వాల్సి ఉందట. అందుకే ఏకంగా రూ.54 కోట్లు పారితోషకం కిందట అడిగాడట అక్షయ్. ఈ విషయంలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఐతే ఓ హీరోయిన్ అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతుండటం మాత్రం ఆశ్చర్యకరమైన విషయమే.