Begin typing your search above and press return to search.

మా హీరోలు మల్టీస్టారర్‌ అంటే భయపడుతున్నారు

By:  Tupaki Desk   |   22 July 2022 11:08 AM IST
మా హీరోలు మల్టీస్టారర్‌ అంటే భయపడుతున్నారు
X
బాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరో ఎవరు అంటే తడుముకోకుండా ప్రతి ఒక్కరు టక్కున చెప్పే పేరు అక్షయ్‌ కుమార్‌. ఈయన సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఏడాదికి అరడజను చొప్పున ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఈ ఏడాది లో ఇప్పటికే ఆయన సినిమా లు బ్యాక్ టు బ్యాక్‌ వచ్చేశాయి. మరి కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి.

ఇంత బిజీ హీరో తాజాగా కాఫీ విత్ కరణ్‌ టాక్ షో లో సమంత తో కలిసి పాల్గొన్నాడు. ఆ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను అక్షయ్‌ కుమార్‌ కరణ్‌ తో పంచుకున్నాడు.

సమంత తో అక్షయ్‌ షో కు హాజరు అవ్వడానికి కారణం.. పాపులారిటీ సర్వే లో హీరోల్లో అక్షయ్‌.. హీరోయిన్స్ ల్లో సమంత నెం.1 గా నిలిచారట. అందుకే వారిద్దరిని కలిపి షో కు పిలిచినట్టుగా కరణ్ మాటల ద్వారా అర్థం అయ్యింది.

ఇక అక్షయ్‌ కుమార్‌ బాలీవుడ్‌ మల్టీ స్టారర్ సినిమాల గురించి మాట్లాడుతూ... హిందీ హీరోలు చాలా మంది మల్టీస్టారర్ సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా పెద్ద హీరోలు మల్టీ స్టారర్ అనగానే భయపడుతున్నారు. అసలు కథ లు కూడా వినకుండానే మల్టీ స్టారర్‌ అనగానే నో చెప్పేస్తున్నారు.

ప్రస్తుతం తాను కరణ్‌ తో కలిసి ఒక సినిమాను నిర్మించేందుకు వెయిట్‌ చేస్తున్నాను. ఆ సినిమా లో రెండో హీరో కావాల్సి ఉంది. ఆ పాత్ర కోసం ఇప్పటి వరకు మాకు హీరో లభించడం లేదు. యంగ్‌ హీరోలు.. సీనియర్‌ హీరోలు ప్రతి ఒక్కరు కూడా మల్టీ స్టారర్ అంటే పెద్దగా ఆసక్తి చూపడం లేదు.. పైగా ఎలాంటి ఫలితం వస్తుందోనన్న భయం వారిలో కనిపిస్తుందని అక్షయ్ అన్నాడు.

సౌత్‌ లో మాత్రం మంచి కథలతో మల్టీ స్టారర్ లు వస్తున్నాయి. హిందీ స్టార్‌ హీరోలు సోలో హీరో కథలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో పాటు రొటీన్ కథలు చేయడం వల్లే సినిమా లు పెద్దగా ఆడటం లేదు అనే అభిప్రాయంను అక్షయ్‌ కుమార్‌ వ్యక్తం చేశాడు. అక్షయ్‌ కుమార్‌ వ్యాఖ్యలకు బాలీవుడ్‌ స్టార్స్ నుండి ఏమైన స్పందన వస్తుంది అనేది చూడాలి.