Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ నాతో సినిమా చేయాలి: అక్షయ్ కుమార్

By:  Tupaki Desk   |   2 Jun 2022 4:01 AM GMT
అల్లు అర్జున్ నాతో సినిమా చేయాలి: అక్షయ్ కుమార్
X
గత కొంతకాలంగా సౌత్ సినిమాలో బాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు క్రియేట్ చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు హీరోలు అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో వారికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో బాక్సాఫీస్ మార్కెట్ ను కూడా పెంచుకుంటున్నారు. అయితే ఈ విషయంపై బాలీవుడ్ మీడియా అక్కడి స్టార్స్ నే ఏదో ఒక ప్రశ్న అడుగుతూనే ఉంది.

దీంతో కొందరు తొందరపడి త్వరలోనే బాలీవుడ్ మళ్లీ ఫామ్ లోకి వస్తుంది అని కూడా చెబుతున్నారు. కానీ అన్ని సినిమాలు ఒకటి అనే చెప్పే వారు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు.

ఇక అక్షయ్ కుమార్ ఈసున్నితమైన విషయంపై చాలా పాజిటివ్ గా స్పందించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పృథ్వి రాజ్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న అక్షయ్ కుమార్ ను సౌత్ సినిమాల విజయం బాలీవుడ్లో డామినేట్ చేస్తోంది అని దీన్ని ఎలా చూస్తారు అని ఒక మీడియా రిపోర్టర్ ప్రశ్నించాడు.

దీంతో అక్షయ్ కుమార్ విషయం పై చాలా కోపం గానే సమాధానం ఇచ్చినట్లు కనిపించింది. దయచేసి సౌత్ నార్త్ సినిమాలు అనే విభేదాలు చూపకండి అంటూ సినిమా అనేది ఒక్కటే అనే ఇక్కడ అందరూ సమానమే అని కూడా వివరణ ఇచ్చాడు.

మంచి కంటెంట్ ఉన్న సినిమాలను జనాలు భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు అని ఇండియన్ సినిమా ఒక్కటే ఇప్పుడు మాట్లాడుతుంది అని తెలియజేశారు.

ఇక భవిష్యత్తులో సౌత్ నార్త్ అనేది ఉండదు అని అక్కడి హీరోలు ఇక్కడి హీరోలతో కలిసి పని చేస్తారని అల్లు అర్జున్ నాతో సినిమా చేయాలి నేను కూడా ఇతర హీరోలతో సినిమా చేయాలని అక్షయ్ కుమార్ సమాధానం ఇచ్చారు. దీంతో అక్షయ్ ఇచ్చిన సమాధానం పై సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ గా కామెంట్స్ వస్తున్నాయి. అక్షయ్ ఈ విషయంతో తొందర పడకుండా పెద్దగా విభేదాలు చూపకుండా చాలా పాజిటివ్ గా స్పందించారు అని అంటున్నారు.