Begin typing your search above and press return to search.
ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ నటుడు
By: Tupaki Desk | 30 Sept 2020 11:15 AM ISTకొద్ది కాలం క్రితం బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద ఆత్మహత్య నుంచి బయటకు రాక ముందే.. మరో బాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య చేసుకోవటం కలకలంగా మారింది. సుశాంత్ తరహాలోనే ఈ యువ నటుడి సూసైడ్ చేసుకోవటం గమనార్హం. బాలీవుడ్ సినిమాల్లో పరిమితంగా పాత్రలు పోషించిన 26 ఏళ్ల అక్షత్ ఉత్కర్ష్ తాజాగా తన ఫ్లాట్ లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
బుల్లితెర నటుడిగా సుపరిచితుడైన అతగాడు.. భోజ్ పురి సినిమాల్లోనూ నటించాడు. కొన్ని టీవీ సీరియళ్లలో కనిపించిన ఇతడికి అవకాశాలు పెరగటంతో ముంబయికి వచ్చాడు. అంధేరి వెస్ట్ లోని ప్లాట్ లో స్నేహ చౌహాన్ అనే యువతితో కలిసి ఉంటున్నాడు. తాజాగా.. బాత్రూంకు వెళ్లిన అక్షత్.. ఎంతసేపటికి తిరిగి రాకపోవటంతో అనుమానం వచ్చిన యువతి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాత్రూం తలుపు బద్ధలు కొట్టి చూడగా.. ఫ్యాన్ కు ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వైనం కనిపించింది. దీంతో.. బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ లు నిలిచిపోవటంతో ఉత్కర్ష్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఉంటారని భావిస్తున్నారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ఉత్కర్ష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతన్ని ఎవరో చంపేసి ఉంటారని చెబుతున్నారు. ఆదివారం రాత్రి కూడా తాము ఫోన్ చేశామని.. తాను తర్వాత మాట్లాడతానని చెప్పాడని ఉత్కర్ష్ తండ్రి పేర్కొన్నారు. తర్వాత తాము ఫోన్ చేసినా కాల్ తీయలేదన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. పోస్టు మార్టం అనంతరం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అందజేశారు. రానున్న రోజుల్లో ఈ సూసైడ్ కేసు మరెన్ని చర్చలకు తావిస్తుందో చూడాలి.