Begin typing your search above and press return to search.
కమల్ కు అక్షరాలు నేర్పుతోంది
By: Tupaki Desk | 25 Sept 2017 4:07 PM ISTనటనలో కమల్ హాసన్ కు కొత్తగా చెప్పాల్సిన నేర్పాల్సిన విషయాలు ఏమీ ఉండవు. యాక్టింగ్ లో ఆయనో ఎన్ సైక్లోపీడియా. కానీ ఇప్పుడు ఆయన కొత్త రంగంలోకి వచ్చేస్తున్నారు. పొలిటికల్ ఎంట్రీ ఖాయం అయిపోయింది. ఓ కొత్త పార్టీని ఏర్పాటు చేసి.. జనాల్లోకి తీసుకెళ్లి.. అధికార పగ్గాలకు చేరువ కావాలంటే.. కచ్చితంగా మీడియాతో పాటు సోషల్ మీడియా హెల్ప్ కూడా చాలా అవసరం.
ఫిలిం టెక్నాలజీలో కమల్ దిట్ట. కానీ ఇప్పుడు కొత్త రంగంలో అయితే కొత్తకొత్త అంశాలను లేటెస్ట్ జనరేషన్ నుంచి అరువు తెచ్చుకోవాలి. ఇందుకోసం ఆయన తన కూతురుపై డిపెండ్ కావాలని డిసైడ్ అయ్యారట. అయితే.. పొలిటికల్ గా కమల్ హాసన్ కు సాయం చేస్తున్న వ్యక్తి శృతి హాసన్ కాదు. శృతి చెల్లెలు అక్షర హాసన్.. ఈ విషయంలో తండ్రికి సాయం చేయబోతోందట. అనేక రకాల అంశాలపై తండ్రికి సలహాలు సూచనలు ఇస్తోందని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. సోషల్ మీడియా ప్రచారంపై కమల్ హాసన్ కు ఈ అక్షర హాసన్ అక్షరాల నుంచి అన్నీ నేర్పించే పనిలో ఉంది.
యాక్టింగ్ ఫ్యామిలీలో పుట్టినా.. అక్షరహాసన్ కు సామాజిక అంశాలపై పట్టు ఎక్కువ. శృతి సంగతి అలా కాదు. ఆమె టార్గెట్ నటనలో తండ్రికి వారసురాలిగా ఎదగడమే. ఇదే సమయంలో అక్షర మాత్రం రాజకీయంగా తండ్రికి అండగా నిలవాలని ఫిక్స్ అయిపోవడం విశేషం. పొలిటికల్ పార్టీ బ్యాక్ గ్రౌండ్ యాక్టివిటీస్ లో శృతి యాక్టివ్ గా ఉండకపోయినా.. భవిష్యత్తులో ప్రచార సమయంలో మాత్రం ముందుండి ఓటర్లను ఆకట్టుకునేందుకు మాత్రం ప్రయత్నించవచ్చు.