Begin typing your search above and press return to search.

గాగ్రా, లెహంగాలో అద‌ర‌గొట్టేసింది

By:  Tupaki Desk   |   21 Nov 2015 5:30 AM GMT
గాగ్రా, లెహంగాలో అద‌ర‌గొట్టేసింది
X
ఓ వైపు ఫాద‌ర్ క‌మ‌ల్‌ హాస‌న్ చీక‌టిరాజ్యం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ మూవీ ఓ డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ అన్న టాక్ వ‌చ్చింది. విల‌క్ష‌ణ న‌టుడు సోలో పెర్ఫామెన్స్ ఇర‌గ‌దీశాడ‌న్న టాక్ వ‌చ్చింది. ఈ మూవీ త‌మిళంలో తూంగ‌వ‌నం పేరుతో డీసెంట్ హిట్ సాధించింది. నీ వ‌య‌సులోనూ పెద్దాయ‌న ద‌క్షిణాది సినీప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన హవా సాగిస్తున్నాడు. మ‌రోవైపు సోద‌రి శ్రుతి హాస‌న్ స్టార్ హీరోయిన్‌ గా స్కై లోకి దూసుకొచ్చింది. ఇటు ద‌క్షిణాది, అటు ఉత్త‌రాది రెండు చోట్లా బిజీ స్టార్ ఇప్పుడు. క్ష‌ణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ హ‌ల్‌ చల్ చేస్తోంది. ప్ర‌స్తుతం శ్రుతిహాస‌న్ తెలుగులో నాగ చైత‌న్య స‌ర‌స‌న ప్రేమ‌మ్ రీమేక్‌ లో న‌టిస్తోంది. అలాగే చ‌ర‌ణ్ స‌ర‌స‌న త‌ని ఒరువ‌న్ రీమేక్‌ లో - ఎన్టీఆర్ స‌ర‌స‌న మైత్రి మూవీస్ సినిమాలో న‌టింప‌జేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఇదిలా ఉండ‌గానే అక్ష‌ర హాస‌న్ నుంచి ఓ శుభ‌వార్త విన‌వ‌చ్చింది.

అక్ష‌ర హాస‌న్ శ్రుతి లానే బాలీవుడ్‌ లో కెరీర్ ప్రారంభించింది. పా ఫేం బాల్కీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ష‌మితాబ్ చిత్రం ద్వారా అక్క‌డ ప‌రిచ‌యం అయ్యింది. మొద‌టి సినిమా ఆశించినంత విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో అక్ష‌ర చాలా కాలంగా విరామం తీసుకోవాల్సొచ్చింది. ఇన్నాళ్టికి ఇప్పుడు రెండో సినిమాలో న‌టించే ఛాన్సొచ్చింది. లాలి కి షాదీ మై లాడు దీవానా అనేది టైటిల్‌. ఈ మూవీ ఆన్‌ సెట్స్ కొత్త అవ‌తారంలో క‌నిపించింది. లెహంగా - గాగ్రా డ్రెస్‌ లో స‌రికొత్త అవ‌తారంలో క‌నిపించింది. ష‌మితాబ్‌ లో కేవ‌లం బ్లాక్ టాప్‌ - జీన్స్‌ లో క‌నిపించిన ఈ అమ్మ‌డు ఈ డ్రెస్‌ లో మ‌తిచెడే అవ‌తారంలో అద‌ర‌గొట్టేసింది. ఈ ఫోటో చూస్తే ఆ సంగ‌తి మీకే అర్థ‌మ‌వుతుంది. రెండో మూవీతో హిట్టు కొట్టి లైమ్‌ లైట్‌ లోకి వ‌స్తుందేమో చూడాలి.