Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఎంత హాట్‌ పెళ్ళి కూతురో...

By:  Tupaki Desk   |   10 Aug 2015 1:43 PM GMT
ఫోటో స్టోరి: ఎంత హాట్‌ పెళ్ళి కూతురో...
X
కమల్ హాసన్ చిన్న కూతురు, శృతిహాసన్ చెల్లెలు అక్షర హాసన్. ఇలా వాళ్ల కూతురు, వీళ్ల చెల్లి అని పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా.. తనేంటో నిరూపించుకుంటోంది ఈ చిన్న హాసన్. షమితాబ్ తో తెరంగేట్రం చేసి ఆకట్టుకున్న అక్షర... తాజాగా ఓ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో ధరించిన డ్రస్... ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

పింక్ కలర్ లెహెంగా ధరించి.. అదే రంగు ఆర్నమెంట్స్ తో.. అమాయకమైన పెళ్లికూతురు గెటప్ తో అదిరిపోయింది. ఈ చిన్నది ధరించిన రవికపై అద్దిన త్రీడీ స్టిక్కర్స్ భలే ఆకట్టుకున్నాయి. అక్షర ధరించినవన్నీ సింపుల్ వేర్. అంతకంటే సింపుల్ అండ్ సూపర్ గా కనిపించాయి ఈ చిన్నదాని ఒంటిమీద. నటనకు, సంచలనాలకు తండ్రి కేరాఫ్ అడ్రస్ అయితే... ముగ్ధ మనోహన సౌందర్యానికి ప్రతిభకు మేము చిరునామా అంటున్నారు కూతుళ్లు. మొత్తానికి ఇంకా టీనేజ్ గాళ్ లా కనిపించే అక్షర హాసన్... అక్షరాలు నేర్చుకునే టైంలోనే... అందరినీ ఆకట్టుకోవడం విశేషం.