Begin typing your search above and press return to search.

మన్మథుడు 2.. క్లారిటీ ఇచ్చేసిన హాట్ బ్యూటీ

By:  Tupaki Desk   |   29 April 2019 2:55 PM GMT
మన్మథుడు 2.. క్లారిటీ ఇచ్చేసిన హాట్ బ్యూటీ
X
అక్కినేని నాగార్జున కొత్త సినిమా 'మన్మథుడు 2' మొదటి నుంచి ప్రేక్షకులందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో నాగ్ ఎంత యంగ్ లుక్ లో ఉన్నాడో రీసెంట్ గా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన పిక్స్ చూసి ఒక అంచనాకు వచ్చేశారు. దాదాపు అరవయ్యేళ్ళ వయసులో నాగార్జున చేసే ఎక్సర్ సైజులు.. ఫిట్నెస్ చూసి చాలామంది యంగ్ టాలీవుడ్ హీరోలు కూడా అసూయ పడి ఉంటారు.

ఈ సినిమాలో మొదట నాగార్జున సరసన రకుల్ ప్రీత్ అనగానే జోడీ సరిగా ఉండదేమో అని కొంతమంది అనుమానాలు వెలిబుచ్చారు. కానీ రీసెంట్ ఫోటోలు చూస్తుంటే నాగ్-రకుల్ జోడీ ప్రేక్షకులకు తప్పనిసరిగా మెప్పిస్తుందనే నమ్మకం కలిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో హాట్ బ్యూటీ కూడా ఉందనే సంగతి తెలిసిందే. బెంగుళూరు భామ అయిన అక్షర గౌడ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోందని.. సినిమా ఒక ట్రయాంగిల్ లవ్ స్టొరీ అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ తాజాగా అక్షర గౌడ తన పాత్ర జస్ట్ క్యామియో అని కన్ఫాం చేసింది. సో.. ఈ సినిమాకు ఫుల్ గా గ్లామర్ టచ్ ఇస్తుంది కానీ.. హీరోతో లవ్ ఎఫైర్ లేనట్టే.

ఇక అక్షర పాత్ర గురించి వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఈ సినిమాలో ఒక ఎన్నారై గా కనిపిస్తుందట. నాగార్జున ఈ హాట్ బ్యూటీపై మనసు పారేసుకుంటాడట. కానీ రకుల్ మాత్రం నాగ్ పై మనసు పారేసుకుంటుందట. ఒకవేళ అదే నిజమైతే నాగ్ ను వెనక తిప్పుకునేలా గ్లామర్ ఒలికించాలిగా. పాప సోషల్ మీడియాఖాతాలు చూస్తే ఆ పనిని అవలీల చేసి అవతా పారేసేలా ఉంది. గంగిగోవు పాలు గంటెడైనను చాలు అంటుంటారు.. అలానే ఇలాంటి హాటు పాప క్యామియో.. ఐదు నిముషాలు ఉన్నా చాలు.. ప్రేక్షకుల జన్మ ధన్యం!