Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: తెలుగు కుర్రాళ్ల‌కు హాటీ ట్రీటు

By:  Tupaki Desk   |   30 Sep 2019 2:30 PM GMT
ఫోటో స్టోరి: తెలుగు కుర్రాళ్ల‌కు హాటీ ట్రీటు
X
వెబ్ సిరీస్ ల ట్రెండ్ అంత‌కంత‌కు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స‌మంత‌-రాధిక ఆప్టే- ప్రియ‌మ‌ణి ఇలా టాప్ స్టార్లు అంతా వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తున్నారు. ప‌లువురు బాలీవుడ్.. టాలీవుడ్ న‌టీన‌టులు వెబ్ సిరీస్ బాట ప‌డుతున్నారు. అయితే బెంగ‌ళూరు న‌టి అక్ష‌ర గౌడ అందుకు మినహాయింపేమీ కాదు. పైగా ఈ అమ్మ‌డి ట్రీట్ సంథింగ్ స్పెష‌ల్ అని తెలుస్తోంది.

ఇటీవ‌లే రిలీజైన మ‌న్మ‌ధుడు 2లో స్పెష‌ల్ అప్పియ‌ర‌న్స్ ఇచ్చింది ఈ గ్లామ‌ర్ డాళ్. అల్ట్రా మోడ్ర‌న్ గ్లామ‌రస్ పాత్ర‌లో తెలుగు యువ‌త‌కు అదిరిపోయే ట్రీటిచ్చింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ అమ్మ‌డు డిజిట‌ల్ రంగంలో అడుగు పెడుతోంది. ఓ తెలుగు వెబ్ సిరీస్ లో నాయిక‌గా క‌నిపించ‌నుంది. ప్ర‌ఖ్యాత గీతా ఆర్ట్స్ సంస్థ ఈ వెబ్ సిరీస్ ని నిర్మించ‌నుంది. ఆద‌ర్శ్ బాల‌కృష్ణ ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు.

అలాగే అక్ష‌ర సోషల్ మీడియాలోనూ యమ ఫాస్ట్. ఇన్ స్టాగ్ర‌మ్ లో అదిరిపోయే ఫోటోల్ని షేర్ చేస్తూ అభిమానుల‌కు కంటిపై కునుకు ప‌ట్ట‌నీకుండా చేస్తోంది. గులాబీ రంగు డిజైన‌ర్ డ్రెస్... పింక్ డిజైన‌ర్ వేర్ లో అక్ష‌ర ఇచ్చిన ట్రీటు మామూలుగా లేదుగా. ఇన్ స్టా తిర‌గేస్తే క‌ళ్లు భైర్లు క‌మ్మాల్సిందే.