Begin typing your search above and press return to search.
అప్పుడు అక్కినేనికి ఎకరం రూ.5 వేలకు ఇచ్చారు.. ఇప్పుడు శంకర్ కు రూ.5 లక్షలకు ఇచ్చాం
By: Tupaki Desk | 8 Nov 2020 6:00 PM ISTతెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత హైదరాబాద్ లో సినిమా పరిశ్రమ మరింత అభివృద్ది చెందడటంతో పాటు సినిమా స్టూడియోల ఏర్పాటుకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఆ నేపథ్యంలో తెలంగాణ దర్శకుడు నిర్మాత అయిన ఎన్ శంకర్ స్టూడియో నిర్మాణంకు స్థలం కావాలంటూ విజ్ఞప్తి చేయడంతో ఎకరా రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను ఆయనకు ప్రభుత్వం కేటాయిస్తూ జీవోను తీసుకు వచ్చింది. అతి తక్కువకే ప్రభుత్వ భూమిని శంకర్ కు అప్పగించడంపై కరీంనగర్ కు చెందిన జె శంకర్ అనే వ్యక్తి కోర్టులో ప్రజాహిత వ్యాఖ్యం వేశాడు. ప్రభుత్వంపై కోర్టుకు ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. జె శంకర్ పిర్యాదును స్వీకరించిన కోర్టు ప్రభుత్వంను కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.
ఈ కేసు విషయమై ప్రభుత్వం తరపున మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి అయిన అరవింద్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు. దర్శక నిర్మాత శంకర్ నల్లగొండ జిల్లా మారుమూల ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తి. ఆయన సినిమా పరిశ్రమలో 36 ఏళ్లుగా ఉంటున్నారు. ఆయన తన అనుభవంతో రూ.50 కోట్ల విలువతో ప్రపంచ స్థాయి స్టూడియోను హైదరాబాద్ లో నిర్మించేందుకు ముందుకు వచ్చి ప్రభుత్వం వద్ద 2016లో దరకాస్తు చేసుకోవడం జరిగింది. ఆయన స్టూడియో నిర్మించడం వల్ల వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాది లభిస్తుంది. ఆ కారణంగానే రూ.5 లక్షలకు ఎకరం చొప్పున ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో మార్కెట్ విలువ 20 లక్షల రూపాయలు ఉంది.
హైదరాబాద్ కు సినిమా పరిశ్రమ వచ్చిన సమయంలో ఇక్కడ స్టూడియోల ఏర్పాటు కోసం అంటూ అక్కినేని నాగేశ్వరరావుకు అప్పటి ప్రభుత్వం రూ.5 వేలకు ఎకరం చొప్పున 22 ఎకరాలు కేటాయించింది. పద్మాలయ స్టూడియోకు 8.5 వేల చొప్పున కేటాయించారు. ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ కు మరియు ఇతర సినిమా ప్రముఖులకు కూడా తక్కువ రేటుకు సినిమా పరిశ్రమ కోసం స్థలం కేటాయించడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు ఎన్ శంకర్ కు కూడా రూ.5 లక్షల చొనప్పున నామమాత్రపు ధరకు స్థలం కేటాయించడం జరిగిందని ఈ సందర్బంగా కోర్టుకు ప్రభుత్వం తరపున తెలియజేయడం జరిగింది. మరి ఈ కౌంటర్ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.