Begin typing your search above and press return to search.

సక్సెస్ కాన్సెప్ట్ తో అక్కినేని 'థ్యాంక్యూ'

By:  Tupaki Desk   |   1 Sep 2021 1:30 AM GMT
సక్సెస్ కాన్సెప్ట్ తో అక్కినేని థ్యాంక్యూ
X
అక్కినేని నాగచైతన్య నటించిన లవ్‌ స్టోరీ విడుదలకు సిద్దంగా ఉంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. వచ్చే నెలలో ఆ సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. మరో వైపు థ్యాంక్యూ సినిమా తో కూడా చైతూ సిద్దంగా ఉన్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం థ్యాంక్యూ సినిమా షూటింగ్ దాదాపుగా ముగిసిందట. విక్రమ్‌ కుమార్ దర్శకత్వంలో రూపొందిన థ్యాంక్యూ మూవీ విడుదల విషయంలో స్పష్టత లేదు. కాని కాన్సెప్ట్‌ గురించి ఇటీవల సోషల్‌ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

థ్యాంక్యూ లో హీరో మూడు వయసుల్లో కనిపించబోతున్నాడు. కాలేజ్ డేస్.. లైఫ్‌ ను సీరియస్ గా లీడ్‌ చేసే ఏజ్‌ ఆ తర్వాత మిడిల్ ఏజ్‌ ల్లో హీరో నాగచైతన్యను దర్శకుడు చూపించబోతున్నాడు. ఇదే తరహాలో నాగచైతన్య ప్రేమమ్‌ మూవీలో కనిపించాడు. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ప్రేమమ్ తెలుగు లో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. చైతూకు ఆ పాత్రలు మూడు కూడా మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఆ తర్వాత కూడా చైతూ అటువంటి కాన్సెప్ట్‌ లతో సినిమాలు చేశాడు. ఆ సినిమాల్లో కొన్ని కమర్షియల్‌ హిట్‌ అవ్వగా కొన్ని మంచి పేరును తెచ్చి పెట్టాయి.

మొత్తంగా విభిన్నమైన ఏజ్‌ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ సినిమాలకు మంచి టాక్ ఉంది. హీరోలు ఇలా కనిపించిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక థ్యాంక్యూ సినిమాను కూడా ఖచ్చితంగా ప్రేక్షకులు ఆధరిస్తారు అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ సినిమాలు అంటే చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌ మరియు స్క్రీన్‌ ప్లే ఉంటుంది. అందుకే థ్యాంక్యూ సినిమా కోసం ఆయన అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. ఈ కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఎప్పుడు విడుదల అయ్యేది క్లారిటీ లేదు. వచ్చే ఏడాది వరకు ఈ సినిమా కోసం వెయిట్‌ చేయక తప్పదేమో. లవ్‌ స్టోరీ.. థ్యాంక్యూ సినిమాలతో పాటు బంగార్రాజు సినిమాతో కూడా చైతూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.