Begin typing your search above and press return to search.
కారులో షికారుకెళ్తూ కెమెరా కంటపడిన అక్కినేని స్టార్ కపుల్..!
By: Tupaki Desk | 12 Feb 2021 10:00 PM ISTటాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య - సమంత కారులో డ్రైవ్ కి వెళ్తూ కెమెరా కంటపడ్డారు. అక్కినేని సక్సెస్ ఫుల్ హీరో చైతూ తన భార్య సమంతను కారులో డ్రైవ్‌కు తీసుకెళ్లాడు. ఈ స్టార్ కపుల్ తమ కారులో డ్రైవ్ కెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. నాగచైతన్య, సమంత కొత్త మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. వారిద్దరూ కొత్తగా కొనుక్కున్న కారులో అలా షికారుకు వెళ్లారట. ఫోటోలు చూస్తుంటే సమంత, చైతూలు చాలా హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తున్నారు. ఫ్యాన్స్ వీరిద్దరినీ చైసామ్ అంటూ పిలుచుకుంటారు. మెల్లమెల్లగా ఈ జంట తమ డ్రీమ్స్ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటున్నారు. అందులో భాగంగానే కొత్త రాయల్ బ్లూ మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారు కొనుగోలు చేసి షార్ట్ రైడ్ కు వెళ్లినట్లు టాక్.
ఏ మాయచేసావే సినిమాతో కలిసి నటించిన చైసామ్.. 2017లో పెళ్లి పీటలెక్కి ఒక్కటయ్యారు. అప్పటినుండి ఈ జంట అభిమానులకు ఆరాధ్యంగానే కనిపిస్తుంది. పెళ్లి తర్వాత కూడా నాగచైతన్య, సమంత తమ సినీ కెరీర్ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా కంప్లీట్ చేసాడు. ఆ సినిమా ఈ వేసవిలో విడుదల కాబోతుంది. ఆ సినిమాతో పాటు థాంక్యూ సినిమా చేస్తున్నాడు చైతూ. ఇక సమంత విషయానికి వస్తే ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో కాతువకుల రెండు కాదల్ సినిమా చేస్తోంది. తెలుగు, తమిళంలో రూపొందనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార కూడా నటిస్తున్నారు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో శకుంతల అనే హిస్టోరికల్ మూవీ చేయనుందని సమాచారం. చూడాలి మొత్తానికి ఈ స్టార్ కపుల్ లైఫ్ బిజీగా ఎంజాయ్ చేస్తున్నారు.