Begin typing your search above and press return to search.

అక్కినేని కోడ‌లు రాకింగ్ డ్యాన్స్

By:  Tupaki Desk   |   31 Aug 2019 5:31 PM GMT
అక్కినేని కోడ‌లు రాకింగ్ డ్యాన్స్
X
కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు వేడుక‌ల కోసం అక్కినేని ఫ్యామిలీ వెకేష‌న్ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. స్పెయిన్ ఇబిజ‌లో టోట‌ల్ ఫ్యామిలీ అదిరిపోయే జోష్ తో సెలబ్రేష‌న్స్ లో మునిగి తేల్తున్నారు. అక్క‌డ వేడుక ఎలా ఉందో ఇప్ప‌టికే ఫోటోల‌ రూపంలో అక్కినేని కోడ‌లు స‌మంత షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. మామ నాగార్జున న‌వ‌కుడిలా ఫోజులిచ్చిన ఫోటో.. మొత్తం ఫ్యామిలీ ఫోటోని స‌మంత‌ షేర్ చేశారు.

తాజాగా హ‌బ్బీ నాగ‌చైత‌న్య‌తో క‌లిసి సామ్ ఏ రేంజులో చిలౌట్ చేస్తోందో ఈ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతుంది. స్పెయిన్ ఇబిజ‌లో పార్టీ మూడ్ లో ఫుల్ జోష్ తో క‌నిపిస్తున్నారు ఈ యువ‌జంట‌. అక్క‌డ ఓ ఇండోర్ థియేట‌ర్ కం మాల్ లో అదిరిపోయే ఈవెంట్ కి ఎటెండ‌య్యారు. ఊక వేస్తే రాల‌నంత‌మంది జ‌నం అక్క‌డ పూర్తిగా పార్టీ మూడ్ లో క‌నిపిస్తున్నారు.

వియ్ విల్ రాక్ యు.. వియ్ విల్ రాక్ యు అంటూ లౌడ‌ర్ సౌండ్ తో వ‌స్తున్న పాట‌కు సామ్ అదిరిపోయే స్టెప్పులు వేసింది. త‌న‌తో అక్క‌డ చాలా క్యాజువ‌ల్ గా క‌నిపిస్తున్న నాగ‌చైత‌న్య అంతే జోష్ ని చూపించారు. ఇక అక్క‌డ సామ్ సింపుల్ వైట్ టీస్.. గ‌ళ్ల ఫ్యాంటుతో క‌నిపించిన తీరు ఇంట్రెస్టింగ్. రాకింగ్ స్టైల్లో ర‌క్తి క‌ట్టిస్తున్న ఈ వీడియో మీరూ చూడండి మ‌రి.