Begin typing your search above and press return to search.

హలో.. ఇక ప్రమోషన్స్ స్టార్ట్

By:  Tupaki Desk   |   14 Nov 2017 5:07 AM GMT
హలో.. ఇక ప్రమోషన్స్ స్టార్ట్
X
జీవితంలో నవ్వులు బాధలు అందరికి వస్తూనే ఉంటాయి. ఎంత హ్యాపీగా ఉన్నా హ్యాపీ అనే విషయంలోనే ఎదో ఒక పరిణామం బాధకు గురి చేస్తుంటోంది. అయితే అవన్నీ ఎప్పటికపుడు రిఫ్రెష్ చేస్తేనే మళ్లీ అసలైన ఆనందం దొరుకుతుంటోంది. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ కూడా అదే తరహాలో ఆలోచిస్తోంది. మొన్నటి వరకు ఫ్యామిలీ మొత్తం నాగ చైతన్య - సమంత పెళ్లి వేడుకలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ వరం మొదటి రోజే గ్రాండ్ గా రిసెప్షన్ ని నిర్వహించి నాగార్జున ఫ్యామిలీ చాలా హ్యాపీగా కనిపించింది. అయితే రెండవ రోజు మాత్రం ఎన్నడూ లేని విధంగా ఫైర్ ఆక్సిడెంట్ వారిని బాధకు గురి చేసింది. నిన్న ఈవినింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ఫైర్ ఆక్సిడెంట్ ఏ స్థాయిలో జరిగిందో అందరికి తెలిసిందే. మనం సెట్ మొత్తం బూడిదపాలైంది. దాదాపు 2 కోట్ల వరకు నష్టం వచ్చిందని నాగ్ తెలిపారు. నాగార్జున బాధగానే ఉన్నా ఎవ్వరికి ఏ అపాయం కాలేదనే సంతోషంతో కూడా ఉన్నారు.

అయితే ఆ విషయాన్ని మరచిపోయి మళ్లీ రిఫ్రెష్ గా నాగ్ నెక్స్ట్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. హలో ఫ్రెండ్స్.. ఇది ఎమోషనల్ వీక్!! మేము నవ్వును బాధను చూశాం. ఇక ఇప్పుడు హలో ప్రమోషన్స్ కోసం తొలి అడుగు వేయబోతున్నాం. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయని నాగ్ ట్వీట్ చేశాడు.