Begin typing your search above and press return to search.

అక్కినేని హీరోలా మ‌జాకా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా

By:  Tupaki Desk   |   28 May 2022 2:30 AM GMT
అక్కినేని హీరోలా మ‌జాకా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా
X
టాలీవుడ్ లో ఏ హీరో ఖాలీగా లేరు. క‌రోనా కార‌ణంగా రెండేళ్లు విరామం ల‌భించ‌డంతో ఇప్ప‌డు ఆ స‌మ‌యాన్ని వాడుకుంటూ ఎడా పెడా సినిమాలు అంగీక‌రిస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి క్రేజీ స్టార్ నిఖిల్ వ‌ర‌కు అంతా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో క్ష‌ణం తీరిక లేకుండా షూటింగ్ ల‌తో గ‌డిపేస్తున్నారు. అక్కినేని వారు కూడా ఇదే త‌ర‌హాలో వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. ఎక్క‌డా త‌గ్గేదిలే అంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అంగీక‌రిస్తున్నారు.

కింగ్ నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, అఖిల్ ఈ ముగ్గురు అక్కినేని హీరోలు ఇప్ప‌డు వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో ఫుల్ బిజీగా మారారు. ఇటీవ‌ల 'బంగార్రాజు' మూవీతో నాగార్జున‌, నాగ‌చైత‌న్య ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ భారీ విజ‌యాన్ని సొంతం చేసుకోలేక‌పోయినా ఫ‌ర‌వాలేద‌నిపించింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన స్థాయిలో కాక‌పోయినా ఓకే అనిపించే స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఈ మూవీ త‌రువాత నాగార్జున, నాగ‌చైత‌న్య కెరీర్ ప‌రంగా స్పీడు పెంచారు.

అఖిల్ కూడా అదే జోరుని చూపిస్తున్నాడు. నాగార్జున 'బంగార్రాజు' త‌రువాత 'ఘోస్ట్‌' మూవీలో న‌టిస్తున్నారు. ఈ మూవీని ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కిస్తున్నారు. మోనాల్ చౌహాన్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈమూవీ షూటింగ్ రాకెట్ స్పీడుతో జ‌రుగుతోంది.

దీనితో పాటు బిగ్ బాస్ నాన్ స్టాప్ కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించారుజ‌. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజ‌న్ 6 కి కూడా నాగ్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. రీసెంట్ గా ఓ ప్రోమోని నిర్వాహ‌కులు రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

ఇక నాగ‌చైత‌న్య 'మ‌నం' ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ తో 'థాంక్యూ' మూవీని చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే ఈమూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనితో పాటు నాగ‌చైత‌న్య 'ధూత‌' పేరుతో అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ వెబ్ సిరీస్ ని చేస్తున్నారు. 10 ఎపిసోడ్స్ తో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

త్వ‌ర‌లోనే త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు డైరెక్ష‌న్ లో ఓ బైలింగ్వ‌ల్ మూవీని చేయ‌బోతున్నారు చై. ఇవి పూర్తి కాగానే ప‌ర‌శురాబ‌మ్ డైరెక్ష‌న్ లో కొత్త చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఇక అఖిల్ 'ఏజెంట్' మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్ లో రూపొందుతున్న ఈ మూవీని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న భారీ క‌మ‌ర్షియ‌ల్ హిట్ ని ఎలాగైనా సొంతం చేసుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో వున్నాడు అఖిల్‌. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ మ‌నాలిలో జ‌రుగుతోంది. ఇలా తండ్రి కొడుకులు ముగ్గురూ ఎక్క‌డా త‌గ్గేదిలే అన్న‌ట్టుగా బిజీ బిజీగా అయిపోయారు.