Begin typing your search above and press return to search.

అక్కినేని కాంపౌండ్ సైలెంట్ అయ్యిందే?

By:  Tupaki Desk   |   10 Sept 2019 11:00 AM IST
అక్కినేని కాంపౌండ్ సైలెంట్ అయ్యిందే?
X
యాక్టింగ్ లెజెండ్ గా తెలుగునాట చెరగని ముద్రవేసిన అక్కినేని నాగేశ్వర్ రావు గారి వారసత్వం నాగార్జున చక్కగా అందిపుచ్చుకున్నాడు కానీ మిగిలిన హీరోలు మాత్రం తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని ఏర్పరచుకోవడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు. అదే ఇప్పుడు అక్కినేని కాంపౌండ్ లో సైలెన్స్ కి కారణం అవుతున్నట్టుగా ఫిలిం నగర్ టాక్.

దశాబ్దాల క్రితం రామ్ గోపాల్ వర్మ ప్రేమకథతో పరిచయమైన సుమంత్ కొన్నాళ్ళు బాగానే బండి నడిపాడు కాని ఆ తర్వాత వరస ఫెయిల్యూర్స్ తో కొంత గ్యాప్ తీసుకున్నాడు. మళ్ళిరావా లాంటి డీసెంట్ తో హిట్ కం బ్యాక్ ఇచ్చినా సుబ్రమణ్యపురం - ఇదం జగత్ సీన్ ని మళ్ళి మొదటికే తెచ్చాయి. మరోవైపు సుశాంత్ చిలసౌతో మొదటి బోణీ కొట్టాడు కాని నిర్మాతలకే ఇంకా కాన్ఫిడెన్స్ రాక కథలు చెప్పడం లేదని ఫిలిం నగర్ గాసిప్

మరోవైపు చైతు ఒక్కడే కొంచెం బెటర్ గా కనిపిస్తున్నాడు. మజిలితో కోలుకున్నాడు. అఖిల్ ఎంట్రీ జరిగి నాలుగేళ్ళు అవుతున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. సుప్రియ గూడచారితో కం బ్యాక్ చేస్తే పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. స్వయానా నాగార్జున ట్రాక్ రికార్డే తేడా కొడుతోంది. మన్మధుడు 2 డిజాస్టర్ సంగతి పక్కనపెడితే కంటెంట్ గురించి చాలా విమర్శలను సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఊపిరి తర్వాత నాగ్ గర్వంగా చెప్పుకునే హిట్ ఒక్కటీ లేదు. ఇలా ఫ్యామిలీ మొత్తం ఓ బ్లాక్ బస్టర్ కోసం వేచి చూడాల్సి రావడం నిజంగా అభిమానులను కలవరపరిచేదే. ఇంకో నాలుగు నెలలో కొత్త ఏడాది వస్తుంది కాబట్టి అప్పటినుంచైనా తమ హీరోలకు హిట్లు దక్కాలని కోరుతున్నారు అభిమానులు