Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ పిక్ షేర్ చేసిన అక్కినేని హీరో!!

By:  Tupaki Desk   |   26 Dec 2020 12:45 PM IST
ఫ్యామిలీ పిక్ షేర్ చేసిన అక్కినేని హీరో!!
X
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున తర్వాత ఆ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. కెరీర్ లో హిట్ సినిమాలతో పాటు అదేవిధంగా ప్లాప్ సినిమాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అక్కినేని ఫ్యామిలీ అంటే సినీ అభిమానులకు ఎంతో స్పెషల్. కానీ ఆ ఫ్యామిలీ నుండి నాగార్జున, నాగచైతన్యలు నిలబడినట్లుగా సుమంత్ తన కెరీర్ బిల్డ్ చేసుకోలేక పోయాడు. అయితే చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీరావా సినిమాతో తన కెరీర్ రీస్టార్ట్ చేసాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. అందుకే కన్నడ సూపర్ హిట్ సినిమాను కపటదారి పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. సినీ సెలబ్రిటీలంతా ఈ క్రిస్మస్ వేడుకలను వైభవంగానే జరుపుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నడూ లేనివిధంగా అన్ని సినీ ఫ్యామిలీలు క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా హీరో సుమంత్ కూడా తన అక్కినేని ఫ్యామిలీ సెలెబ్రేషన్స్ జరుపుకున్న ఫోటోను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసాడు. ఆ ఫోటోలో అక్కినేని జాయింట్ ఫ్యామిలీ మొత్తం హాజరైనట్లున్నారు. హీరో నాగార్జున ఫ్యామిలీ, వెంకట్ ఫ్యామిలీ, నాగచైతన్య సమంత, సుమంత్, సుప్రియ, సుశాంత్.. పిల్లలు ఇలా అంతా ఒక్కటిగా చేరి ఫోటోకి పోజిచ్చారు. చూస్తూంటే తెలిసిపోతుంది అక్కినేని ఫ్యామిలీ మొత్తం క్రిస్మస్ ని హ్యాపీగా సెలెబ్రేట్ చేసుకున్నారు అని. ఇక సుమంత్ విషయానికి వస్తే ఇటీవల కపటదారి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాడు. త్వరలో ట్రైలర్ విడుదల కానుందని తెలిపింది విదితమే.