Begin typing your search above and press return to search.

పెళ్లిచూపులు దర్శకుడితో అక్కినేని హీరో సినిమా..!

By:  Tupaki Desk   |   17 March 2021 3:42 PM GMT
పెళ్లిచూపులు దర్శకుడితో అక్కినేని హీరో సినిమా..!
X
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. కెరీర్ ప్రారంభంలో లవర్ బాయ్ పాత్రలలో మెప్పించిన చైతూ.. ఇప్పుడిప్పుడే డిఫరెంట్ స్టోరీలతో, నటనకు ఆస్కారమున్న పాత్రలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సవ్యసాచికి ముందు లవర్ బాయ్ గా అలరించి మజిలీ సినిమాతో రూట్ మార్చాడనే చెప్పాలి. నిజానికి మజిలీ సినిమాలో చైతూ నటనకు ప్రశంసలు దక్కించుకున్నాడు. అయితే అక్కినేని హీరోలలో నాగచైతన్య మాత్రమే ప్రస్తుతం కెరీర్ విజయవంతంగా దూసుకెళ్తున్నాడు. ఈమద్యే సినిమా సినిమాకి రూట్ మార్చి అలరించేలా ఉన్నట్లు మూవీ సెలక్షన్ చూస్తే అర్ధమవుతుంది. మజిలీ తర్వాత రెండేళ్లు దగ్గరపడినా నాగచైతన్య నుండి ఒక్క సినిమా రాలేదు. భారీ విరామం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేసాడు.

ఆ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే లవ్ స్టోరీ మూవీ సోషల్ మీడియాతో ఇండస్ట్రీ వర్గాలలో మంచి బజ్ క్రియేట్ చేసింది. సాంగ్స్ అయితే ప్రస్తుతం ఊపేస్తున్నాయి. అయితే లవ్ స్టోరీ పూర్తవకముందే చైతూ.. మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ తో థాంక్యూ సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ లో తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఇదిలా ఉండగా.. తాజాగా చైతూ మరో క్రేజీ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ‘పెళ్లిచూపులు’ ఫేమ్ తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇటీవలే డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ చైతూకి ఓ కథ వినిపించాడట. రొమాంటిక్ కామెడీ జానర్ లో వీరి సినిమా రాబోతుందని టాక్. అలాగే ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించనుండగా.. ఈ ఏడాది చివరిలో అంటే థాంక్యూ మూవీ కంప్లీట్ అయ్యాక స్టార్ట్ అవుతుందని సినీవర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన త్వరలో రానుందట.