Begin typing your search above and press return to search.

అక్కినేని హీరో బాలీవుడ్ ప‌య‌నానికి ముహూర్తం

By:  Tupaki Desk   |   14 March 2021 7:13 AM GMT
అక్కినేని హీరో బాలీవుడ్ ప‌య‌నానికి ముహూర్తం
X
అక్కినేని యువ‌హీరో నాగ‌చైత‌న్య బాలీవుడ్ కి వెళుతున్న సంగ‌తి తెలిసిందే. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చ‌ద్దా చిత్రంలో అత‌డు ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు అత‌డు మే నుంచి త‌న షెడ్యూల్ లో పాల్గొంటాడ‌ని తెలుస్తోంది. మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ - నాగ‌చైత‌న్య‌పై చిత్రీక‌ర‌ణ సాగ‌నుంద‌ని వెల్ల‌డైంది. దీనికోసం నెల‌రోజుల కాల్షీట్ల‌ను చైత‌న్య ఇచ్చార‌ట‌. నిజానికి విజ‌య్ సేతుప‌తి చేయాల్సిన పాత్ర‌లో చైత‌న్య‌కు అవ‌కాశం ల‌భించింది. అత‌డు కాల్షీట్లు కేటాయించ‌లేని ప‌రిస్థితిలో చైత‌న్య‌ను ఈ అకాశం వ‌రించింద‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

ఏదేమైనా స‌రైన అవ‌కాశం వెతుక్కుంటూ వ‌చ్చింది. నిరూపించుకోవాల్సిన టైమ్ వ‌చ్చింద‌న్న‌ది అభిమానుల మాట‌. అమీర్ లాంటి అగ్ర హీరో మూవీ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అక్కినేని హీరోపై అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. స‌రైన ప్లానింగ్ తో అత‌డు అక్క‌డ నిరూపించుకుంటే త‌న సినిమాల‌కు పాన్ ఇండియా మార్కెట్ పెరుగుతుంద‌ని హిందీ మార్కెట్లోకి చొచ్చుకెళ్లేందుకు లైన్ క్లియ‌రైన‌ట్టేన‌ని ట్రేడ్ లోనూ విశ్లేషిస్తున్నారు.

`లాల్ సింగ్ చద్దా` అమెరికన్ చిత్రం ఫారెస్ట్ గంప్ కి అధికారిక‌ రీమేక్. ఇందులో అమీర్ ఖాన్- కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లాల్ సింగ్ చద్ద ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది. నాగ‌చైత‌న్య న‌టించిన ల‌వ్ స్టోరి త్వ‌ర‌లో రిలీజ్ కి రెడీ అవుతోంది. త‌దుప‌రి విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్న థాంక్యూ మూవీలోనూ అత‌డు న‌టిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.