Begin typing your search above and press return to search.

OTT లో అక్కినేని కుర్రోడు ద‌స‌రా బుల్లోడు

By:  Tupaki Desk   |   23 July 2021 5:49 AM GMT
OTT లో అక్కినేని కుర్రోడు ద‌స‌రా బుల్లోడు
X
స్టార్ హీరోలు కుర్రహీరోలు అనే తేడా లేకుండా అన్ని సెక్ష‌న్ల తార‌లు ఓటీటీ బాట ప‌డుతున్నారు. పెద్ద తెర .. డిజిట‌ల్ అనే విభేధం ఇప్పుడు లేదు. నిజానికి పెద్ద తెర కంటే ఓటీటీలో పెద్ద పేరు తెచ్చుకున్న స్టార్లకు కొద‌వేమీ లేదు. ఇటీవ‌ల అక్కినేని కోడ‌లు స‌మంత ఫ్యామిలీమ్యాన్ 2 తో అద‌రగొట్టిన నేప‌థ్యంలో బ‌డా స్టార్ల చూపు ఓటీటీపై ప‌డింది.

ఇక స‌మంత హ‌బ్బీ నాగ చైతన్య అక్కినేని డిజిట‌ల్ ఎంట్రీ గురించి చాలా కాలంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చైతూ స‌రైన టైమ్ కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం అత‌డు తెలుగు చిత్రం థాంక్స్.. హిందీ చిత్రం లాల్ సింగ్ చద్దాతో బిజీగా ఉన్నారు. OTTలో తొలిసారిగా ఒక ప్రొడక్షన్ హౌస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని తెలిసింది.

తాజా స‌మాచారం ప్రకారం.. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత .. నిర్మాత‌ శరత్ మరార్ ఈ డిజిటల్ చిత్రాన్ని నిర్మిస్తారు.  చైతన్యతో చాలాకాలంగా దీని గురించి చర్చలు జరుపుతున్నారు.  ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉన్న ఈ సిరీస్ కి వీరిద్దరూ అంగీకరించారు. సెన్సిటివ్ ఎలిమెంట్ తో ప్ర‌జ‌ల గుండెల్ని తాకే క‌థాంశాన్ని ఎంచుకుని స‌రైన ద‌ర్శ‌కుడి కోసం వేచి చూస్తున్నారు. థాంక్యూ - లాల్ సింగ్ చద్దాలను పూర్తి చేసిన తర్వాత‌ నాగ చైతన్య ఈ డిజిటల్ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తారు. ద‌ర్శ‌కుడు స‌హా తారాగణం ఇత‌ర సిబ్బంది వివరాలతో  ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన త్వరలో వెలువ‌డ‌నుంది. అన్న‌ట్టు సెన్సిటివ్ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో యువ ద‌స‌రా బుల్లోడిలా చైత‌న్య‌ను ఆవిష్క‌రిస్తారా..!  లేక ఇత‌ర ఓటీటీ థ్రిల్ల‌ర్ల త‌ర‌హాలోనే చైతూ సీరియ‌స్ రోల్ చేస్తారా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.