Begin typing your search above and press return to search.

మూడు చేస్తున్నా ఫ్యాన్స్‌ కు నిరాశే!

By:  Tupaki Desk   |   28 Oct 2018 3:30 PM GMT
మూడు చేస్తున్నా ఫ్యాన్స్‌ కు నిరాశే!
X
నాగార్జున ఇటీవలే నానితో కలిసి ‘దేవదాస్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘దేవదాస్‌’ కు ముందు నాగార్జున నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేక పోయాయి. ‘సోగ్గాడే చిన్ని నాయన’ తర్వాత అక్కినేని ఫ్యాన్స్‌ నాగార్జున నుండి మంచి సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ‘దేవదాస్‌’ చిత్రం తర్వాత నాగార్జున మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. కాని ఆ మూడు సినిమాల్లో ఒక్కటి కూడా తెలుగు సినిమా లేకపోవడంతో ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

హిందీలో చాలా సంవత్సరాల తర్వాత ‘బ్రహ్మాస్త్ర’ అనే చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరో వైపు తమిళంలో ధనుష్‌ తో కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నాడు. ధనుష్‌ చిత్రంలో నాగార్జునది హీరో పాత్ర అనేందుకు లేదు. కీలకమైన ముఖ్య పాత్ర అంటూ తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఇక మలయాళంలో మోహన్‌ లాల్‌ తో కలిసి ఒక చిత్రంను చేస్తున్నాడు. హిందీ, తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తున్న నాగార్జున తెలుగులో మాత్రం ఒక్కటి కూడా చేయడం లేదు.

ప్రస్తుతం చర్చల దశలో రెండు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘సోగ్గాడే చిన్ని నాయన’ ప్రీ క్వెల్‌ ‘బంగార్రాజు’ కాగా, రెండవది రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ‘మన్మధుడు 2’ చిత్రం. ఈ రెండు చిత్రాలకు ప్రస్తుతం కథ వర్క్‌ జరుగుతుంది. ఈ రెండిటిలో ఏది మొదట కథ ఫైనల్‌ అయితే దాన్ని మొదలు పెట్టే అవకాశం ఉంది. వచ్చే నెలలో ఏదో ఒక ప్రాజెక్ట్‌ను సెట్స్‌ మీదకు తీసుకెళ్లాలని నాగార్జున ప్లాన్‌ చేస్తునట్టుగా సమాచారం.