Begin typing your search above and press return to search.

థియేటర్లలో ఒకేసారి తలపడనున్న తండ్రీకొడుకులు..

By:  Tupaki Desk   |   21 March 2020 4:30 PM GMT
థియేటర్లలో ఒకేసారి తలపడనున్న తండ్రీకొడుకులు..
X
అక్కినేని వంశ వారసులైన నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ప్రస్తుతం సినిమా షూటింగుల తో బిజీగా ఉన్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా సినీ ఇండస్ట్రీలో విడుదలకు సిద్దమైన సినిమాలన్నీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అలా కరోనా వలన వాయిదా పడిన సినిమాల లిస్టులో తండ్రి కొడుకులైన నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సినిమాలు కూడా నిలిచాయి. తాజాగా షూటింగ్ ముగింపుకు చేరువైన నాగార్జున 'వైల్డ్ డాగ్' మూవీ, నాగచైతన్య 'లవ్ స్టోరీ' సినిమాలు దాదాపుగా ఒకేసారి విడుదలకు సిద్దమవుతున్నాయట. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నిజమే అన్పిస్తుంది.

అంతేగాక బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుందట. అయితే కింగ్ నాగార్జున మన్మధుడు-2 తో ఘోరమైన పరాజయాన్ని పొందారు. అందుకే ఇప్పుడు సరికొత్త లుక్కులో ఏసీపీ విజయ్ వర్మగా, ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో అలరించడానికి నిర్ణయించుకున్నాడు. 'వైల్డ్ డాగ్' సినిమా టీజర్ చూస్తే నాగార్జున హిట్ కోసం ఎంత ఆరాటపడుతున్నాడో అర్ధం అవుతుంది. ఇక గతేడాది 'మజిలీ' సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న నాగచైతన్య కూడా బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లవ్ స్టోరీ' సినిమా లో భారీ ఆశలతో నటిస్తున్నట్లు తెలుస్తుంది. కెరీర్ మొదటి సినిమా నుండి ఇంతవరకు హిట్ రుచి ఎరుగని అఖిల్ నాల్గవ సినిమాగా వస్తుంది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. ఈ సినిమా పై అక్కినేని ఫ్యామిలీ ఆశలు మాములుగా పెట్టుకోలేదు. ఎందుకంటే మొదటి నుండి ప్లాప్ లలో కూరుకుపోతున్న కొడుకును బొమ్మరిల్లు భాస్కర్ కథ గట్టెక్కిస్తుందా.. అనేది పెద్ద ప్రశ్న. ఇంకా ఈ తండ్రి కొడుకుల ముగ్గురి సినిమాలకు సోషల్ మీడియాలో బజ్ పెద్దగాలేదు.

అదీగాక కరోనా కారణంగా విడుదలలు వాయిదా పడటంతో ముగ్గురి సినిమాలు ఒకేసారి తలపడే అవకాశాలు లేకపోలేదు. ఈ ముగ్గురికి సోలో హిట్స్ పక్కా కావాల్సిందే.. మరి కరోనా ఎఫెక్ట్ తరువాత తలపడనున్న తండ్రి కొడుకుల రేస్ లో ఎవరు గెలుస్తారో చూడాలని ప్రేక్షకులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. బడా బడా హీరోలకు పోటీ పడిందంటేనే ఆ ఫైట్ మాములుగా ఉండదు. అలాంటిది ఒకే ఫ్యామిలీ నుండి ముగ్గురు ఫైటింగ్ కి దిగుతుంటే చూసే వాళ్లకు కూడా థ్రిల్ ఉంటది కదా.. తండ్రా.. కొడుకులా.. తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.