Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా రేస్ లో వెన‌క‌బ‌డ్డ అక్కినేని?

By:  Tupaki Desk   |   3 April 2022 12:00 PM IST
పాన్ ఇండియా రేస్ లో వెన‌క‌బ‌డ్డ అక్కినేని?
X
పాన్ ఇండియా రేసిజం అంత‌కంత‌కు పెరుగుతోంది. టాలీవుడ్ లో అర‌డ‌జ‌ను మంది స్టార్ హీరోలు ఇప్ప‌టికే పాన్ ఇండియా వార్ లో స‌త్తా చాటుతున్నారు. చిరంజీవి- ప్ర‌భాస్ - రామ్ చ‌ర‌ణ్ - బ‌న్ని- ఎన్టీఆర్ ఇప్ప‌టికే భారీ పాన్ ఇండియా సినిమాల్లో న‌టించారు. ప్ర‌భాస్ .. చ‌ర‌ణ్ ప్లానింగ్ ప‌రంగా ఒక‌డుగు ముందుంటే ఆ త‌ర్వాత రేస్ లోకి బ‌న్ని - ఎన్టీఆర్ చేరారు. సైరా న‌ర‌సింహారెడ్డి త‌ర్వాత చిరు ఆలోచ‌న‌లు చూస్తుంటే పాన్ ఇండియా మార్కెట్ ని కొల్ల‌గొట్టాల‌న్న క‌సి క‌నిపిస్తోంది. అందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

అయితే ప‌రిశ్ర‌మ‌లో మ‌రో అగ్ర హీరో అక్కినేని నాగార్జున కానీ ఆయ‌న వార‌సులు కానీ పాన్ ఇండియా రేస్ లో ఉన్నారా లేరా? అన్న‌దానికి స‌రైన జ‌వాబు లేదు. నిజానికి గ‌డిచిన‌ ఏడాది నాగ్ - నాగ‌చైత‌న్య ప్లానింగ్ అసాధార‌ణంగానే ఉంది. నాగార్జున వ‌రుస‌గా క్రియేటివ్ స్క్రిప్టుల‌తో ప్ర‌యోగాల్ని ఆప‌లేదు.

బ్ర‌హ్మాస్త్ర లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలోనూ నాగ్ న‌టించారు. ఈ సినిమా ఈ ఏడాది విడుద‌ల కానుంది. నాగ‌చైత‌న్య ఇప్పుడు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో అసోసియేట్ అయ్యి భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టించాడు. అమీర్- చైత‌న్య న‌టించిన‌ లాల్ సింగ్ చ‌ద్దా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.

అయితే ఈ రెండు సినిమాలు భారీ విజయాలు సాధిస్తే పాన్ ఇండియా సినిమాల్లో న‌టించిన హీరోలుగా అక్కినేని హీరోల‌కు పేరొస్తుంది కానీ.. ఆ త‌ర్వాత ఒక ప్ర‌శ్న కూడా అక్కినేని అభిమానుల్లో స్థిరంగా నిలుస్తుంది. ఇప్ప‌టికే పాన్ ఇండియా వార్ లో ప్ర‌ముఖ తెలుగు హీరోలు సోలోగా దూసుకుపోతున్నారు.

ఈ రేస్ లో చేరాలంటే నాగ‌చైత‌న్య ప్ర‌య‌త్నాలు ఎలా ఉండ‌నున్నాయి? అన్న‌దే క్వ‌శ్చ‌న్ మార్క్. ఇక‌పోతే చైత‌న్య స్థిరంగా విజ‌యాలు అందుకుంటూ ప్ర‌స్తుతానికి ప్రాంతీయ మార్కెట్ పైనే దృష్టి సారించాడు. త‌దుప‌రి త‌మిళంలోనూ రాణించే ఆలోచన ఉంది.

ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ ల‌పైనా దృష్టి సారించి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాల‌ని ప్ర‌యోగాలు చేస్తున్నాడు. అక్క‌డ స‌క్సెసైతే నెమ్మ‌దిగా పాన్ ఇండియా మేకోవ‌ర్ పైనా దృష్టి సారిస్తాడ‌ని భావించ‌వ‌చ్చు. మ‌రోవైపు స‌మంత సైతం హిందీ సినిమాలు చేస్తూ.. పాన్ ఇండియా స్టార్ డమ్ వైపు అడుగులు వేస్తుండ‌డం విశేషం.

2022లో విడుదల కానున్న అనేక భారీ చిత్రాల్లో బ్రహ్మాస్త్ర- లాల్ సింగ్ చ‌ద్దా పై భారీ అంచ‌నాలున్నాయి. అలాగే పృథ్వీరాజ్.. లాల్ సింగ్ చద్దా.. విక్రమ్ వేద.. సర్కస్ .. రామ్ సేతు లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయి. ఇవ‌న్నీ ఆర్.ఆర్.ఆర్ నింపిన స్ఫూర్తితో విజ‌యం సాధిస్తాయ‌ని భారీ వ‌సూళ్ల‌ను అందుకుంటాయ‌ని ఆశిస్తున్నారు. RRR ఇప్ప‌టికే 800 కోట్లు వ‌సూలు చేసి 1000 కోట్ల క్ల‌బ్ వైపు ప్ర‌యాణిస్తోంది. ఇక ద‌రిదాపుల్లో వేరొక సినిమా ఇంత‌టి విజ‌యం సాధిస్తుందా? అన్న‌ది వేచి చూడాలి.