Begin typing your search above and press return to search.

మరోసారి గ్లామర్ పాళ్ళు పెంచేసిన అక్కినేని బ్యూటీ!!

By:  Tupaki Desk   |   7 Jan 2021 1:30 AM GMT
మరోసారి గ్లామర్ పాళ్ళు పెంచేసిన అక్కినేని బ్యూటీ!!
X
సౌత్ హీరోయిన్ సమంత రోజురోజు తన అందాలతో సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. కొత్త పోజులతో, సరికొత్త డ్రెస్సింగ్స్ తో మోడలింగ్ ప్రపంచంలో తన మార్క్ తో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటుంది. తాజాగా సమంత చేసిన న్యూ ఫోటోషూట్ చూపరులను కళ్లు తిప్పుకోకుండా చేస్తుందంటే నమ్మాల్సిందే. అలా అందాలను వడ్డీస్తోంది సామ్. రానురాను సామ్ ఫోటోషూట్స్ లో గ్లామర్ పాళ్ళు పెంచుకుంటూ వెళ్తోంది. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తెరమీద గ్లామర్ పాత్రలు చేయడం కాస్త తగ్గించింది. కానీ నిజంగా ఆఫ్-స్క్రీన్ లో స్వేచ్ఛగా కుర్రగుండెలలో వేగం పెరిగే రేంజిలో గ్లామర్ షో చేస్తోంది. ఎంతైనా ఫేవరేట్ హీరోయిన్ని ఇలాంటి ఫోటోలలో చూస్తే ఏ అభిమానికైనా పండగే అనాలి. అంతలా ఆకట్టుకుంటున్నాయి సామ్ సోయగాలు.

తాజా ఫోటోలో సామ్.. బ్లాక్ స్లీవ్ లెస్ టాప్ తో గోల్డ్ డిజైన్ బాటమ్ ధరించి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. ఈ డిజైన్ డ్రెస్ లో సామ్ మరింత అందంగా కనిపిస్తుంది అంటే నమ్మాల్సిందే. ఇటీవలే సామ్, తన భర్త చైతూతో కలిసి మాల్దీవ్స్ హాలిడేస్ ట్రిప్ వెళ్లొచ్చింది. అలా ట్రిప్ నుండి తిరిగి రాగానే క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఇంకా న్యూ ఇయర్ వేడుకలు కూడా ఎలా చేసిందో అందరికి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత.. విజయ్ సేతుపతి, నయనతార కాంబినేషన్ లో విఘ్నేశ్ శివన్ సినిమా చేస్తోంది. అలాగే ఆహా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో సామ్ జామ్‌ అనే టాక్ షో కూడా నిర్వహిస్తోంది. సామ్ జామ్ ప్రోగ్రాం చివరి ఎపిసోడ్ జనవరి 8న ఉండటంతో ఆ ఎపిసోడ్ గెస్ట్ గా భర్త నాగచైతన్యను ఆహ్వానించింది. చూడాలి మరి ఎలా ఆకట్టుకుంటుందో ఈ జంట!