Begin typing your search above and press return to search.

అఖిల్‌ కోసం మసాలా దట్టిస్తున్నారు

By:  Tupaki Desk   |   15 April 2015 7:00 AM IST
అఖిల్‌ కోసం మసాలా దట్టిస్తున్నారు
X
అఖిల్‌ని ఎట్టిపరిస్థితుల్లో టాప్‌ స్టార్‌ని చేయాలి. ఇదీ కింగ్‌ నాగార్జున ముందున్న సవాల్‌. అయితే లక్ష్యం సాధించడానికి ఓ తండ్రిగా చేయాల్సినవన్నీ చేస్తున్నారు.

కొడుక్కి ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నారు. వి.వి.వినాయక్‌ లాంటి స్టార్‌ డైరెక్టర్‌ని ఇచ్చారు. నితిన్‌లాంటి ఫ్రెండునిచ్చారు. ఫ్రెండుచేతే పెట్టుబడులు పెట్టిస్తున్నారు. అంతెందుకు ఈ సినిమాని నిర్మిస్తూ ఓ పాటలో తళుక్కుమనే అవకాశం కూడా అఖిల్‌ ఫ్రెండు నితిన్‌కిచ్చారు.

లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో అన్న నాగచైతన్య కూడా ఎంట్రీ ఇస్తున్నారు. తమ్ముడితో కలిసి ఆ సీన్‌ని ఇరగదీస్తాడని సమాచారం. అయితే ఇన్ని కిటుకులు వి.వి.వినాయక్‌ లాంటి మాస్‌ డైరెక్టర్‌కి మాత్రమే తెలుసు కాబట్టి తెలివిగా అతడినే కొడుక్కి అప్పగించారు. ఏదేమైనా నాగ్‌ ప్రణాళిక అసాధారణమైనది. అఖిల్‌ని ఎట్టి పరిస్థితుల్లో మాస్‌లో బాస్‌ని చేయాలన్నది అతడి తపన. అందుకు తగ్గట్టే అర్థవంతమైన ప్రయత్నం చేస్తున్నారు. సోషియో ఫాంటసీ తరహా కథాంశమే అయినా ఈ చిత్రంలో రొమాన్స్‌, లవ్‌, కామెడీ, సెంటిమెంటు అన్నిటినీ కలగలిపి ఓ వండర్‌నే తయారు చేస్తున్నారని తెలుస్తోంది.

ఇటీవలే అఖిల్‌ని యూట్యూబ్‌లోకి వదిలారు. ఓ చిన్న బిట్‌లో ఫైట్‌ సీన్‌ చూపించి పరేషాన్‌ చేశారు. టాలీవుడ్‌లో ఎంతో అనుభవమున్న ఓ స్టార్‌ హీరో ఫీట్‌లా ఉంది అది. అందుకే అఖిల్‌ ఆల్వేస్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌.