Begin typing your search above and press return to search.

సన్ అఫ్ పవర్ స్టార్ అదిరాడుగా

By:  Tupaki Desk   |   9 April 2018 8:47 AM GMT
సన్ అఫ్ పవర్ స్టార్ అదిరాడుగా
X
బయట టాక్ ఎలా ఉన్నా ఫాన్స్ మధ్య విభేదాలు ఉన్నా అవి తమ ఫ్యామిలీలో కాదని మెగా హీరోస్ ఎప్పటికప్పుడు ఋజువు చేస్తూనే ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ మొదటి వారసుడు అకీరానందన్ పుట్టిన రోజు సందర్భంగా అటు సోషల్ మీడియాలో పవర్ స్టార్ ఫాన్స్ బాగానే హంగామా చేసారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా సాయి ధరం తేజ్ లాంటి హీరోలు విష్ చేయగా రామ్ చరణ్ మాత్రం ఒక స్పెషల్ మెమరీని గిఫ్ట్ గా ఇచ్చాడు. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ చిరు ఇంటికి వచ్చి కేక్ కటింగ్ లో పాల్గొని లంచ్ కూడా చేసిన సంగతి తెలిసిందే. కాని ఆ రోజు మరో సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటంటే పవన్ తో పాటు ఆ రోజు అన్నయ్య చరణ్ ను విష్ చేయడానికి అకీరానందన్ కూడా నాన్నతో పాటు వచ్చాడు. ఆ పిక్ నే విష్ చేయటంతో పాటు షేర్ చేసాడు చెర్రి.

ఇంకేముంది. ఫాన్స్ ఆనందానికి హద్దులు లేవు. అదలా ఉంచితే పవన్ వారసుడిగా అకీరాను అభిమానులు ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఇంచు మించు వరుణ్ తేజ్ హైట్ కు వచ్చేలా ఉన్న అకీరాలో హీరో ఫీచర్స్ అయితే పుష్కలంగా ఉన్నాయి. పైగా చైల్డ్ యాక్టర్ గా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు కనక ఓ ఐదారేళ్ళ తర్వాత టాలీవుడ్ లో లాంచ్ చేసినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ అదే జరిగితే పవన్ ఫాన్స్ బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటారు. రేణు దేశాయ్ తో విడిపోయాక కూడా పిల్లలు మాత్రం పవన్ తో రెగ్యులర్ టచ్ లోనే ఉన్నారు. అందుకే పవన్ దగ్గరుండి మరీ వీళ్ళను తనతో పాటే ఇలా తీసుకువెళ్తున్నాడు.

ఒకవేళ సీరియస్ గానే అకీరా హీరో కావాలి అనుకుంటే దానికి ఎక్కువ టైం పట్టదు. చదువయ్యాక ఓ రెండేళ్ళు యాక్టింగ్ లో శిక్షణ ఇప్పిస్తే చాలు మెగా కాంపౌండ్ లో జాయిన్ అయిపోవచ్చు. పవన్ ఫాన్స్ అయితే బలంగా కోరుకుంటున్నారు. రేణు దేశాయ్ మనసులో కూడా అదే ఉన్నట్టు గతంలోనే స్పష్టమైంది. పవర్ స్టార్ ని మించి హైట్ ఉన్న అకీరా మిగిలిన విషయాల్లో కూడా తండ్రిని మించాలనే ఫాన్స్ కోరిక.