Begin typing your search above and press return to search.
హీరోగా అకిరా నందన్ ఎంట్రీ : ఎక్కువ రోజులు ఆగేలా లేడుగా!
By: Tupaki Desk | 9 Dec 2020 12:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ ఏ పాటిదో తెలిసిందే. ఏ స్టార్ కైనా స్టార్ డం అనేది హిట్, ప్లాప్ ల పైన ఆధారపడి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అది వర్తించదు. 1996లో సినిమాల్లో అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ 2001 లో ఖుషీ వచ్చే వరకు వరుస హిట్లు సాధించి ఆకాశమంత స్టార్డమ్ సంపాదించాడు. ఖుషీ తరవాత పవన్ కళ్యాణ్ కి సరైన హిట్ పడలేదు. మధ్యలో జల్సా ఓ మోస్తారు హిట్టయిన అది పవన్ కళ్యాణ్ రేంజ్ కాదు. గబ్బర్ సింగ్ వచ్చేంతవరకు ఏకంగా 11 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ కి హిట్ లేదు.
పవన్ కాకుండా ఇలా 11 ఏళ్ల పాటు హిట్లు లేకుంటే ఏ హీరో అయినా ఉండి ఉంటే ఈ పాటికి కనుమరుగయ్యేవాడు. కానీ పవన్ కళ్యాణ్ కు వరుసగా ఫ్లాప్ లు వచ్చినా ఆయన క్రేజ్ మాత్రం పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ రెండేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్ళీ వరుసగా సినిమాలు అంగీకరిస్తూ నటిస్తున్నారు. అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన తనయుడు అకిరా నందన్ హీరోగా ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా.. అని పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ప్రస్తుతం అకిరా ఏజ్ 16 మాత్రమే. కానీ అకిరాను చూస్తే 16 ఏళ్ల టీనేజర్ అని ఎవరూ అనుకోరేమో. ఎందుకంటే అతడు ఈ వయసుకే 6.4 హైట్ పెరిగాడు. ప్రభాస్, రానా, వరుణ్ తేజ్ కంటే అకిరా 2 ఇంచుల హైట్ ఎక్కువే ఉన్నాడు. అతడు హీరో గా ఎంట్రీ ఇస్తే పవన్ కళ్యాణ్ లెగసినీ కంటిన్యూ చేస్తాడని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుంటున్నారు. మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యే అన్ని ప్లస్ పాయింట్స్ అకీరా లో కనిపిస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇవాళ ఉదయపూర్ లో మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రత్యేక విమానంలో ఉదయపూర్ కి బయలుదేరి వెళ్లారు. అయితే పవన్ వెంట అకిరా కూడా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన అకిరాను చూసినవారు షాక్ కు గురవుతున్నారు. తండ్రి పక్కన నడుచుకుంటూ వస్తున్న అకీరానందన్ ఫోటోలు బయటకు రాగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫోటోల్లో అకీరానందన్ హైట్ కి తగ్గ ఫిజిక్ తో ఆకట్టుకునేలా కనిపించాడు. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ తెగ సంబరం వ్యక్తం చేస్తున్నారు. అకిరా నందన్ తెలుగు లో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు. మరో మూడున్నర సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు ఉండడంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలు చేసి తిరిగి రాజకీయాల్లో బిజీ అయ్యే అవకాశం ఉంది. ఆలో గా పవన్ కళ్యాణ్ తన కొడుకును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.