Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఫ్యామిలీలో కోవిడ్ క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   11 Jan 2022 6:48 AM GMT
ప‌వ‌న్ ఫ్యామిలీలో కోవిడ్ క‌ల‌క‌లం
X
దేశ వ్యాప్తంగా మ‌ళ్లీ క‌రోనా విజృంభిస్తోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్ర‌తీ ఒక్క‌రిని ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా సెల‌బ్రిటీల‌ను సైతం వ‌ద‌ల‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వారంతా ఇప్పుడు వ‌రుస‌గా కోవిడ్ బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే స్టార్ హీరో మ‌హేష్ బాబు, మంచు మ‌నోజ్‌, మంచు ల‌క్ష్మీ, నిర్మాత బండ్ల గ‌ణేష్‌, శోభ‌న‌, ఖుష్బూ, స‌త్య‌రాజ్‌, డా. రాజేంద్ర ప్ర‌సాద్‌, త్రిష కోవిడ్ బారిన ప‌డ్డారు.

తాజాగా న‌టి, ద‌ర్శ‌కురాలు, ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, ఆమె త‌న‌యుడు అకిరా నంద‌న్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విష‌యాన్ని రేణు దేశాయ్ సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా వెల్ల‌డించింది. `అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని ఇంట్లోనే వున్న‌ప్ప‌టికీ నేను, అకీరా క‌రోనా బారిన ప‌డ్డాం. కొన్ని రోజుల క్రితం ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గా ప‌రీక్ష‌లు చేయిస్తే కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్ర‌స్తుతం మేం కోలుకుంటున్నాం. నేఉ ఇది వ‌ర‌కే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను.

అయినా నాకు క‌రోనా సోకింది. అకీరాకు వ్యాక్సిన్ వేయించాల‌ని నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో అత‌నికి కోవిడ్ సోకింది. ఈ థ‌ర్డ్ వేవ్ ను చాలా తేలిగ్గా తీసుకోకండి.. సీరియ‌స్ గా తీసుకోండి. మాస్కులు ధ‌రించండి.. జాగ్ర‌త్త‌లు పాటించండి.. జాగ్ర‌త్త‌గా వుండండి` అంటూ రేణు దేశాయ్ ఇన్ స్టా వేదిక‌గా వెల్ల‌డించారు. ఈ విష‌యం తెలిసిన దీంతో ప‌వ‌న్ అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ప‌వ‌న్ మాజీ భార్య రేణు దేశాయ్, ఆమె త‌న‌యుడు అకిరా కోవిడ్ భారిన ప‌డ‌టంతో ప‌వ‌న్ అభిమానుల్లో ఆందోళ‌న మొద‌లైంద‌ని తెలుస్తోంది. త‌మ అభిమాన హీరో ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఇలా కోవిడ్ బారిన ప‌డ‌టంతో వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నార‌ట‌.