Begin typing your search above and press return to search.

తిరుమలలో కెమెరాకు చిక్కిన అకిరా.. ఫ్యామిలీతో అలా!

By:  Tupaki Desk   |   19 March 2021 2:30 PM GMT
తిరుమలలో కెమెరాకు చిక్కిన అకిరా.. ఫ్యామిలీతో అలా!
X
సామాన్యంగా సెలబ్రిటీల పిల్లలు సోషల్ మీడియాలో దర్శనమిస్తేనే మురిసిపోతుంటారు సినీ అభిమానులు. అలాంటిది నేరుగా ఎదురుపడితే ఎలా ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితి నెలకొంది తిరుమల తిరుపతి దేవస్థానంలో. నిజానికి అభిమాన హీరోలు తమ పిల్లల గురించి బయట పెద్దగా మాట్లాడరు. ఎందుకంటే వాళ్లు ఇండస్ట్రీలోకి రావాలని అనిపించినప్పుడు వారే జనాల ముందుకు వస్తుంటారు అని నమ్ముతుంటారు. కానీ ఇదంతా సోషల్ మీడియా అందుబాటులో లేనప్పుడు అలాంటి మాటలు సెట్ అవుతాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీతో పాటు అన్ని అందుబాటులోకి వచ్చేసాయి. అందరూ కూడా సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచి అభిమానులకు టచ్ లో ఉంటున్నారు.

తాజాగా సోషల్ మీడియా ద్వారానే ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీ కొడుకు వార్తల్లో నిలిచాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్. ఈరోజు అకిరా నందన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో కెమెరా కంటపడ్డాడు. అదికూడా ఒంటరిగా కాదు. తన తల్లి రేణుదేశాయ్, చెల్లి ఆధ్యతో కలిసి సాధారణ భక్తుల బాటన దర్శనానికి లైన్ లో నిలబడ్డారు. సెలబ్రిటీలు అయ్యుండి ఇలా సాధారణ భక్తులతో లైన్ లో కనిపించే సరికి అందరూ షాక్ అవుతున్నారు. కానీ వీరు వెంకటేశ్వరుడి దర్శనం అయిపోయి బయటికి వచ్చేవరకు ఎవరి కంటాపడలేదు. చివరిగా మీడియా వారు గుర్తించి పవన్ కళ్యాణ్ కుటుంబం అని వారిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేసారు. ఫోటోల కోసం మాస్కు తీయలేదు అకిరా. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.