Begin typing your search above and press return to search.
పవన్ పిల్లల స్పెషల్ గణేషుడు
By: Tupaki Desk | 18 Sept 2015 10:09 AM ISTవినాయకచవితి పండుగ రోజున స్టార్ల వారసులు ఏం చేస్తారు ? అదేం ప్రశ్న.. ఎవరైనా పండుగ రోజున పూజ చేస్తారు, అంతే కదా అనుకుంటున్నారా ! కరెక్టే కానీ.. గణేషుడి బర్త్ డే అంటే పెద్దోళ్ల కంటే పిల్లల హడావిడే ఎక్కువగా ఉంటుంది. స్టార్ లైనా, వాళ్ల ఫ్యాన్స్ కైనా ఎవరికైనా సరే.. ఇది యూనివర్సల్ రూల్.
తమకు అందుబాటులో ఉన్న వస్తువులతో వినాయక విగ్రహాన్ని తయారు చేసేందుకు ట్రై చేస్తారు. పళ్లు - పూలు - కాయలు - ఆకులు కోసుకొచ్చే... పండుగ రోజున తెగ హడావిడి చేస్తారు బుడతలు. పూనేలో తల్లి రేణూ దేశాయ్ దగ్గర ఉంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిల్లలది కూడా సేమ్ సీన్. ఈ బుడుగులు వాళ్లే స్వయంగా పర్యావరణ హితమైన వినాయకుడి రూపాన్ని తయారు చేశారట. రేణుదేశాయ్ ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేసింది.
పవన్ కొడుకు అకీరా నందన్ - కూతురు ఆద్యలు ఇద్దరూ కలిసి.. ప్లాస్టిక్ - థర్మాకోల్ ఉపోయోగించకుండా.. వినాయకుడి బొమ్మ తయారు చేశారట. పవన్ కి జూనియర్లు రూపొందించిన బుల్లి వినాయకుడు భలే ముద్దుగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. ఆ రూపానికి పూజ చేసి., ఓ ఫోటో తీసి ట్వీట్ చేసింది పవన్ మాజీ భార్య రేణు. ఏమైనా పవన్ పిల్లలు ఇప్పటి నుంచే క్రియేటివిటీ ప్రదర్శించేస్తున్నారు కదూ,