Begin typing your search above and press return to search.

అఖిల్ సుక్కుతో సినిమా ఎఫ్పుడు చేశాడబ్బా..

By:  Tupaki Desk   |   30 March 2018 11:53 AM IST
అఖిల్ సుక్కుతో సినిమా ఎఫ్పుడు చేశాడబ్బా..
X
తన చిన్న కొడుకు అఖిల్‌ను పెద్ద హీరోను చేద్దామని పెద్ద పెద్ద దర్శకుల్నే లైన్లో పెట్టాడు అక్కినేని నాగార్జున. కానీ వినాయక్.. విక్రమ్ కుమార్ లాంటి స్టార్ డైరెక్టర్లు అఖిల్‌కు మంచి ఫలితాల్ని అందించలేకపోయారు. దీని తర్వాత కొరటాల శివతో అఖిల్ మూడో సినిమా చేయించాలని నాగ్ ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు. దీంతో ‘తొలి ప్రేమ’తో దర్శకుడిగా పరిచయమైన వెంకీ అట్లూరితో సర్దుకుపోతున్నారు. ఐతే అఖిల్‌కు మాత్రం పెద్ద దర్శకులతోనే పని చేయాలనే కోరిక ఉన్నట్లుంది. ఆ జాబితాలో సుకుమార్ కూడా ఉన్నట్లున్నాడు. అఖిల్‌కు మంచి ఫ్రెండయిన రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తీసిన ‘రంగస్థలం’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెబుతూ.. చరణ్‌తో తాను క్లోజ్‌గా ఉన్న ఒక ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు అఖిల్. ఈ సందర్భంగా సుకుమార్ గురించి స్పందిస్తూ ‘వన్ ఆఫ్ మై డైరెక్టర్స్’ అని సంబోధించాడు. దీంతో అందరూ షాకైపోయారు. అఖిల్‌తో సుకుమార్ ఎప్పుడు సినిమా చేశాడబ్బా అని. ఒకవేళ అతడితో సుక్కు సినిమా ఏమైనా కమిటయ్యాడా అన్న సందేహాలు కూడా కలిగాయి. ఈ విషయంపై కొందరు నెటిజన్లు ప్రశ్నించేసరికి అఖిల్ తప్పు దిద్దుకుంటూ ‘వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్’ అంటూ కరెక్షన్‌తో మరో ట్వీట్ చేశాడు. ఐతే ఏమో.. భవిష్యత్తులో సుకుమార్‌ తో పని చేస్తానేమో ఎవరికి తెలుసు అంటూ వ్యాఖ్య కూడా జోడించాడు అఖిల్. మొత్తానికి సుక్కుతో పని చేయాలన్న ఆశ అయితే అఖిల్‌కు బలంగానే ఉన్నట్లుంది. అందుకే ఆ కోరికను దాచుకోకుండా బయటపెట్టేశాడు. మరి సుకుమార్ ఛాన్స్ ఇస్తాడా?