Begin typing your search above and press return to search.

మొత్తానికి ముచ్చటగా మూడోది మొదలైంది

By:  Tupaki Desk   |   26 March 2018 11:33 PM IST
మొత్తానికి ముచ్చటగా మూడోది మొదలైంది
X
అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కే మూడో సినిమా ఏంటి అనే అంశానికి.. కాసింత లేట్ అయినా ఆన్సర్ వచ్చేసింది. తొలి చిత్రం అఖిల్ ఫ్లాప్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని రెండో సినిమా హలోను తెచ్చిన అఖిల్.. హలో ప్రమోషన్స్ లోనే మూడో చిత్రం ప్రకటనను సంక్రాంతికి చేస్తానన్నాడు. కానీ హలోకు మంచి పేరు వచ్చినా.. టాక్ బాగాఉన్నా.. కమర్షియల్ గా నిలబడకపోవడంతో.. మూడో ప్రాజెక్టు విషయంలో కాసింత డిలే అయింది.

మూడు నెలలకు పైగా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసిన అక్కినేని అండ్ టీం.. ఇప్పుడు అఖిల్ హీరోగా రూపొందే మూడో చిత్రాన్ని మొదలుపెట్టేశారు. ముందుగా అనుకున్నట్లుగానే.. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో అఖిల్ మూడో సినిమా ప్రారంభమైంది. ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించి.. ముహూర్తం షాట్ పిక్చరైజేషన్ కూడా పూర్తి చేశారు. అక్కినేని నాగార్జునతో పాటు.. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ ఈవెంట్ కు అటెండ్ కావడం విశేషం.

అఖిల్ థర్డ్ మూవీకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనుండగా.. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రాఫీ బాధ్యతలు నిర్వహించే ఈ చిత్రాన్ని.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. అఖిల్ మూడో సినిమాను త్వరగానే ఫైనలైజ్ చేయడంపై.. అక్కినేని ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.