Begin typing your search above and press return to search.

అవునా.. మా అమ్మ సినిమా చేస్తోందా-అఖిల్

By:  Tupaki Desk   |   7 Nov 2015 6:23 AM GMT
అవునా.. మా అమ్మ సినిమా చేస్తోందా-అఖిల్
X
స్వయంగా కమల్ హాసనే చెప్పాడు.. అమలతో సినిమా చేస్తున్నా, సుదీర్ఘ విరామం తర్వాతం మేమిద్దరం కలిసి సినిమా చేస్తున్నాం అని. నాలుగైదు రోజుల నుంచి మీడియాలో కూడా ఈ వార్త ప్రముఖంగా వస్తోంది. 28 ఏళ్ల తర్వాత ఆ కాంబినేషన్ అని. మరి తన ఫ్యామిలీ మెంబర్స్‌ తో మాట్లాడుకుండానే అమల ఈ సినిమాకు పచ్చజెండా ఊపి ఉంటుందా? తన ముద్దుల కొడుకు అఖిల్ కు ఈ సంగతి చెప్పి ఉండదా? ఐతే అఖిల్ మాత్రం తన తల్లి కమల్ హాసన్ తో సినిమా చేస్తోందన్న సంగతి తనకు అస్సలు తెలియదన్నట్లు ఆశ్చర్యపోతున్నాడు.

ఈ రోజు ‘అఖిల్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రెస్ మీట్ కు వచ్చిన అఖిల్ ను ఓ విలేకరి.. అమల-కమల్ హాసన్ సినిమా గురించి ప్రశ్నించాడు. ఐతే ఆ సంగతి చెప్పగానే అఖిల్ ఆశ్చర్యపోయాడు. ‘‘అవునా.. మా అమ్మ మళ్లీ కమల్ హాసన్ గారితో నటిస్తోందా? నాకు తెలియదే. అది నిజమైతే గ్రేట్ న్యూస్’’ అని బదులిచ్చాడు. ఐతే అఖిల్ మాటలు మాత్రం ఎవ్వరికీ నమ్మశక్యంగా లేవు. అమల ఈ సంగతి అఖిల్ కు చెప్పకుండా ఉంటుందని ఎవ్వరూ అనుకోరు. ఒకవేళ నిజంగానే చెప్పలేదని అనుకుందాం. కనీసం మీడియాలో, సోషల్ మీడియాల ద్వారా అయినా ఈ వార్త మనోడి కంట పడి ఉండదా? సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అఖిల్ ఇలా మాట్లాడటం చిత్రమే మరి. ఇలా మాట్లాడ్డం ద్వారా తాను మంచి నటుడని ప్రూవ్ చేస్తున్నాడా అఖిల్!