Begin typing your search above and press return to search.

అఖిల్ స్పెషల్ విషెస్ ఫర్ రాంచరణ్.. పిక్ వైరల్!

By:  Tupaki Desk   |   27 March 2021 4:12 PM IST
అఖిల్ స్పెషల్ విషెస్ ఫర్ రాంచరణ్.. పిక్ వైరల్!
X
మెగాపవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు సందడి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కనిపిస్తోంది. రాంచరణ్ అభిమానుల నుండి మొదలుకొని సినీ సెలబ్రిటీల వరకు అందరూ తనను విష్ చేస్తూనే ఉన్నారు. తాజాగా అక్కినేని వారసుడు అఖిల్.. ఇంస్టాగ్రామ్ వేదికగా రాంచరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్బంగా చరణ్ తో కలిసి దిగిన త్రోబ్యాక్ ఫోటోను షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చాడు. 'నీతో కొన్ని నిజమైన ఫన్నీ మూమెంట్స్ గుర్తుకు వస్తున్నాయి. నీ దగ్గర ఎల్లప్పుడూ ఉత్సాహవంతమైన వాతావరణం ఉంటుంది. డల్ అనేది కనిపించదు. నిజమైన సంతోషం, సక్సెస్ లకు నువ్వు నిజంగా పొందాలి. ఎంతో ఆనందకరమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ఏడాది నీకు గొప్పగా ఉండబోతుందని ఆశిస్తున్నాను మై స్పెషల్ బ్రదర్' అంటూ పోస్ట్ చేసాడు.

ప్రస్తుతం అఖిల్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అలాగే అఖిల్ మెసేజ్ చూస్తేనే అర్ధమవుతుంది. వారిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉండనేది. అఖిల్ చరణ్ ఇద్దరు కూడా మంచి అన్నదమ్ములు బంధంతో కలిసి ఉంటారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అఖిల్, చరణ్ ఇద్దరూ ఎవరి కెరీర్ పరంగా వారు చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాంచరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా నుండి ఇటీవలే రాంచరణ్ క్యారెక్టర్ అయినటువంటి అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. అలాగే ఆచార్య సినిమాలో కూడా రాంచరణ్ కీలకపాత్ర పోషించాడు. అఖిల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కంప్లీట్ చేసాడు. ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తదుపరి సినిమా చేయనున్నాడు.