Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: సిక్స్ ప్యాక్ లో చినబాబు

By:  Tupaki Desk   |   22 Sept 2018 10:53 PM IST
ఫోటో స్టొరీ: సిక్స్ ప్యాక్ లో చినబాబు
X
అక్కినేని అఖిల్ రీసెంట్ గా తాతగారి జయంతి సందర్భంగా 'Mr. మజ్ను' టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోమియో అవతారం లో బ్రిటన్ లో నిలబడి ఇంగ్లీష్ భాషపై పంచ్ విసిరాడు. "ఏవిటో ఈ ఇంగ్లీష్ భాష.. మిస్ అవకూడని వాటికే మిస్ అని పేరు పెట్టారు!" ఇక అమ్మాయిల మనసులు కొల్లగొట్టాలంటే ఇలాంటి చమత్కారాలు గడుసు మాటలు మాత్రమే సరిపోవు... జనరేషన్ మారింది కదా. ఇప్పుడు ఆరుపలకలు చాలా ఇంపార్టెంట్.

ఇంగ్లీష్ లో సిక్స్ ప్యాక్. మరి సిక్స్ ప్యాక్.. సిక్స్ ప్యాక్ అని జపం చేస్తూ కూర్చుంటే.. కళ్ళు మూసుకుని కలలు కంటే ఆరు పలకలు రావు. దానికి జిమ్ లో క్రమం తప్పకుండా కసరత్తులు చేయాలి. మరి అఖిల్ అసలే ఫిట్నెస్ ఫ్రీక్. దాంతో జిమ్ లో కఠినమైన కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ సాధించాడు. ఆ సిక్స్ ప్యాక్ ను పెద్ద అద్దం ముందు నిలబడి సెల్ఫీ తీసుని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

దానికి ఒక పెద్ద స్టొరీ చెప్పాడు.. "నేను రెడీ! షర్టు లేకుండా షూటింగ్ కోసం కాదు. ప్రియమైన నాన్నతో వెకేషన్ కు వెళ్లేందుకు. కానీ ఒక్క క్షణంలో నేనిలా ఉన్నానేంటి అని నాకనిపించేలా చేస్తాడు. అందుకే ఇది నాకు తప్పదు. ఈ షెడ్యూల్ లాస్ట్ డే షూట్ ఈ రోజు. ఫ్యామిలీ వెకేషన్ కు వెళ్తున్నాం. అన్నయ్య కూడా రెడీ అని అనుకుంటున్నా!!"