Begin typing your search above and press return to search.

అఖిల్ రెండో సినిమా కథ ఇదే..!

By:  Tupaki Desk   |   7 July 2017 6:49 AM GMT
అఖిల్ రెండో సినిమా కథ ఇదే..!
X
అక్కినేని బుల్లోడు అఖిల్ రెండు సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో రెండో సినిమా విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న అఖిల్ ఈసారి మనం, 24 ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందు రెడీ అవుతున్నాడు. అయితే కాస్త డిఫరెంట్ స్టోరీల్ని తెరకెక్కించేందుకు ఇష్టపడే విక్రమ్ అఖిల్ పై కూడా ఓ ఎక్స్ పెరమెంట్ చేసేందుకు ట్రై చేస్తున్నట్లు వినిపిస్తోంది.

22 ఏళ్లు తరువాత చినిపోయే ఓ కుర్రాడు నేపథ్యంగా అఖిల్ రెండో చిత్రం ఉండబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ మధ్య ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఇదే లైన్ తో ఈ వీకెండ్ లో రాబోతున్న రెండు రెళ్లు ఆరు సైతం తెరకెక్కింది. ఈ విషయం ముందే తెలుసుకున్న విక్రమ్ కుమార్ - రెండు రెళ్లు ఆరు నిర్మాతల్ని ఓ సారి సినిమా చూపించమని అడిగిరాట, కానీ కొన్ని కారణల వల్ల విక్రమ్ సినిమా చూడటం సాధ్య పడలేదని సమాచారం. మరి అఖిల్ కి చెప్పిన లైన్ తో ఓ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఇప్పుడు విక్రమ్ మరో కొత్త స్టోరీని వండేందుకు రెడీ అవుతాడేమో చూద్దాం.