Begin typing your search above and press return to search.

రొమాన్స్ తో రెచ్చిపోయిన అఖిల్ - పూజాహెగ్డే.. ఆ సీన్స్ లో ఓ రేంజ్ లో..!

By:  Tupaki Desk   |   14 March 2021 9:10 AM GMT
రొమాన్స్ తో రెచ్చిపోయిన అఖిల్ - పూజాహెగ్డే.. ఆ సీన్స్ లో ఓ రేంజ్ లో..!
X
అఖిల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి అర్ధ పుష్క‌ర కాలం కావ‌స్తోంది. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ స‌రైన హిట్ కొట్ట‌లేదు. అక్కినేని బ్రాండ్ వ్యాల్యూను నిల‌బెట్టే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ కొట్టాల‌ని తెగ ట్రైచేస్తున్న‌ప్ప‌టికీ.. స‌క్సెస్ మాత్రం రీచ్ కాలేదు. అయితే.. అప్ క‌మింగ్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ తో మాత్రం విజ‌యం సాధించాల‌ని గ‌ట్టిగా డిసైడ్ అయ్యాడు న‌వ‌సామ్రాట్‌.

అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. సినిమా టేకింగ్ కూడా బాగానే వ‌చ్చింద‌ని అంటున్నారు. ప్ర‌ధానంగా ఈ మూవీలో ల‌వ్ సీన్స్ అద్భుతంగా వ‌చ్చాయ‌ట. ఈ మూవీ ఫ‌స్ట్ కాపీని స్వ‌యంగా చూసిన నాగార్జున‌.. మూవీ ఔట్ పుట్ విష‌యంలో ఫుల్ హ్యాపీగా ఉన్నాడ‌ని స‌మాచారం.

ఇక‌, ఈ మూవీలో రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుంద‌ని టాక్‌. అఖిల్ - పూజా మ‌ధ్య కెమిస్ట్రీ సూప‌ర్బ్ గా కుదిరింద‌ని, వీరి రొమాన్స్ ఆన్ స్క్రీన్ కేక పెట్టిస్తుంద‌ని అంటున్నారు.

ఈ సినిమా ఇటు అఖిల్ అక్కినేనితోపాటు, అటు ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కు సైతం ఎంతో కీల‌కంగా మారింది. ఇండ‌స్ట్రీకి చాలా కాలంగా దూరంగా ఉన్న భాస్క‌ర్‌.. ఈ మూవీ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ను అద్భుతంగా స్టార్ట్ చేయాల‌ని భావిస్తున్నాడు. ఇందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాడు. అటు అఖిల్ కూడా తానేంటో ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసుకోవాల‌ని చూస్తున్నాడు. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.