Begin typing your search above and press return to search.

అక్కినేని హీరోల ఎమోషన్ అందుకే

By:  Tupaki Desk   |   10 March 2016 11:00 PM IST
అక్కినేని హీరోల ఎమోషన్ అందుకే
X
ఆడియో లాంఛింగ్ లోనే థియేట్రికల్ ట్రైలర్ ఇవ్వడం ఇప్పటివరకూ టాలీవుడ్ లో ఉన్న ట్రెండ్. కానీ నాగార్జున తన కొత్త మూవీ ఊపిరి కోసం కొత్త పంథా అవలంబిస్తూ.. ఇందుకోసం స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి నాగార్జున తనయులు నాగచైతన్య అఖిల్ లు హాజరయ్యారు. ఊపిరి ప్రారంభానికి ముందు జరిగిన సంఘటనలను అందరితో పంచుకున్నారు ఈ అక్కినేని వారసులు

'ఈ సినిమా స్టోరీ విన్నాక నాన్నగారు వీల్ ఛెయిర్ లోనే కూర్చునే పాత్రను చేస్తామంటే నేను ఒప్పుకోలేదు. అలాంటి కేరక్టర్ వద్దని ప్రెజర్ కూడా చేశాం. ఎందుకో అలాంటి రోల్ లో నాన్నని చూడలేం అనిపించింది. కానీ ఇప్పుడు ట్రైలర్ చూస్తే, ఆ ఆలోచన తప్పని అర్ధమైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఎమోషనల్ ఫీలింగ్ కలుగుతోంది' అని చెప్పాడు అఖిల్. ఇలాంటి రోల్ లో తండ్రిని చూస్తుంటే చాలా ఎమోషనల్ గా అనిపిస్తోందని చెప్పాడు నాగచైతన్య. నిజానికి ట్రైలర్ కూడా మనసును హత్తుకునేలా సూపర్బ్ గా ఉందనే చెప్పాలి.

ఫ్రెంచ్ మూవీ ది ఇన్ టచబుల్స్ కి రీమేక్ గా తెరకెక్కిన ఊపిరికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. పీవీపీ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.