Begin typing your search above and press return to search.

అఖిల్ కి ఇంకా వెయిటింగ్ తప్పట్లేదు

By:  Tupaki Desk   |   30 Sept 2016 10:01 AM IST
అఖిల్ కి ఇంకా వెయిటింగ్ తప్పట్లేదు
X
గతేడాది దసరాకి వద్దామని అనుకుని.. ఆ తర్వాత దీపావళికి వాయిదా వేసుకుని.. హీరోగా అరంగేట్రం చేసిన అక్కినేని అఖిల్.. ఆ డిజాస్టర్ తర్వాత బాగా నీరసపడ్డాడు. కొత్త సినిమా స్టార్టింగ్ కోసం చాలానే చర్చలు జరపాల్సి వచ్చింది. చాలామంది దర్శకులను సంప్రదించడం.. స్టోరీలు వినడంతోనే నెలలు గడిచిపోయాయి. ఒకటి రెండు ప్రాజెక్టులు ఫైనల్ అయిపోయాయనే స్టేజ్ లో ఆగిపోగా.. చివరకు మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే.. ఇప్పుడీ దర్శకుడు విక్రమ్ కె కుమార్ కూడా అఖిల్ ని వెయిటింగ్ లోనే పెట్టేస్తున్నాడు. ఇందుకు కారణం రీసెంట్ గా ఇతడి మ్యారేజ్ కావడమే. ప్రస్తుతం హనీమూన్.. లాంగ్ టూర్ వంటి ప్లానింగ్స్ లో ఉన్న విక్రమ్.. సినిమా లాంఛింగ్ కి కూడా డేట్ కేటాయించలేకపోతున్నాడట. సెప్టెంబర్ లోనే కొత్త మూవీకి ముహూర్తం పూజ జరిపేయాలని.. తర్వాత గ్రాండ్ లెవెల్ లో అఖిల్ రీ లాంఛింగ్ ఈవెంట్ జరపాలని నిర్ణయించినా.. ఇంకా ఆ ముహూర్తం కుదరలేదు.

ఇప్పటికీ కొత్త సినిమా మొదలు కాకపోవడం.. విక్రమ్ కె కుమార్ కి కాస్త నెమ్మదిగా సినిమాలు నైజం ఉండడంతో.. అఖిల్ రెండు సినిమాల మధ్య కనీసం ఏడాదిన్నర గ్యాప్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకనుంచైనా ఇంత అంతరం రాకుండా అక్కినేని హీరో చూసుకుంటాడని ఆశిద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/