Begin typing your search above and press return to search.

అఖిల్ ఈసారి తొందరపడ్డం లేదు

By:  Tupaki Desk   |   16 Aug 2016 10:28 AM IST
అఖిల్ ఈసారి తొందరపడ్డం లేదు
X
తొలి మూవీ అఖిల్ తో గట్టి ఎదురుదెబ్బ తిన్న అక్కినేని అఖిల్.. రెండో సినిమా ప్రారంభం కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే చాలామంది దర్శకులను పరిశీలించాక.. చివరకు ఓ ఫైనల్ డెసిషన్ కు వచ్చారట అక్కినేని టీమ్. విక్రమ్ కె కుమార్ తో అఖిల్ మూవీ ఖాయమైనా.. అనౌన్స్ మెంట్ విషయంలో ఈసారి తొందర పడకూడదని అనుకుంటున్నాడట అఖిల్.

గత నెలలో తన రెండో సినిమాపై ఓ అనౌన్స్ మెంట్ చేశాడు అఖిల్. కానీ అది పట్టాలెక్కలేదు. హను రాఘవపూడితో మూవీ చేస్తానని అఖిల్ స్వయంగా చెప్పినా.. చివరకు ఆ ప్రాజెక్ట్ వేరే హీరో చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో తమ కుటుంబంతో మనం లాంటి విభిన్నమైన మూవీ తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన విక్రమ్ కె కుమార్ తో రెండో సినిమా చేసేందుకు ఈ కుర్ర హీరో సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. కానీ దీని అనౌన్స్ మెంట్ ఇప్పుడే చేయడం లేదని అంటున్నారు.

హను విషయంలో చేసిన పొరపాటును మళ్లీ చేయకూడదనే ఉద్దేశ్యంతోనే ఇప్పుడు విక్రమ్ కె కుమార్ ప్రాజెక్టును ప్రకటించే విషయంలో ఆలోచనలో పడేసిందని అర్ధమమవుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అఖిల్ ని గెస్ట్ రోల్ లో ఓసారి డైరెక్టర్ చేసిన విక్రమ్ కె కుమార్.. ఈ సారి ఓ మాంచి లవ్ స్టోరీని తీయనున్నాడని అంటున్నారు. అగ్రిమెంట్స్.. పూజా కార్యక్రమాలు పూర్తయ్యాకే దీని అనౌన్స్ మెంట్ బయటకొచ్చే ఛాన్స్ ఉంది.