Begin typing your search above and press return to search.

అప్పుడే'నా' పెళ్లి అంటున్న అఖిల్

By:  Tupaki Desk   |   16 July 2016 1:15 PM IST
అప్పుడేనా పెళ్లి అంటున్న అఖిల్
X
అక్కినేని అఖిల్ పేరు గత కొన్నాళ్లుగా మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అరంగేంట్ర మూవీ అఖిల్ నిరాశ పరిచిన తర్వాత.. రెండో సినిమా ఎంపికలో ఎలర్ట్ గా ఉంటున్న సంగతులు కొన్నాళ్లు న్యూస్ గా చక్కర్లు కొట్టాయి. ఈ మధ్య మాత్రం సినిమా సంగతుల కంటే అఖిల్ ప్రేమ పెళ్లి అంటున్న వార్తలే వినిపిస్తున్నాయి. శ్రేయా భూపాల్ తో అఖిల్ మ్యారేజ్ అంటూ వార్తలొస్తున్నాయి. ఇప్పుడీ న్యూస్ పై అఖిల్ స్వయంగా క్లారిటీ ఇచ్చేశాడు.

ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదంటూ అఖిల్ ఓ మీడియా హౌజ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పేశాడు. అలాగని ప్రేమ వ్యవహారం గురించి మాత్రం కాదని చెప్పలేదు. చాలా కాలంగా స్నేహితురాలైన అమ్మాయిని ఇష్టపడుతున్న మాట వాస్తవమే అని చూచాయగా చెప్పాడు. ఒకవేళ జరిగితే ఎంగేజ్మెంట్ ఉండొచ్చు కానీ.. పెళ్లి మాత్రం ఇప్పట్లో కాదన్నది అఖిల్ చెప్పిన మాటలకు సారాంశం. స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు చెప్పిన మాటల ప్రకారం.. కెరీర్ స్టార్టింగ్ లో ఉండగా పెళ్లి ప్రణాళికలు అంత కరెక్ట్ కాదని ఫిక్స్ అయ్యాడట అఖిల్.

ఏతా వాతా తేలేదంటంటే త్వరలో అఖిల్ కి తన లవర్ తో ఎంగేజ్మెంట్ మాత్రం జరిగే ఛాన్స్ ఉందంతే. మరోవైపు తన రెండో సినిమాని ఫైనల్ చేయడంలో బిజీగా ఉన్నాడు అఖిల్. అఖిల్ సెకండ్ మూవీని హను రాఘవపూడి దర్శకత్వంలో అంటూ త్వరలో అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.