Begin typing your search above and press return to search.

వావ్!! అఖిల్ బాగా పెంచేశాడండీ

By:  Tupaki Desk   |   21 Sept 2016 12:04 AM IST
వావ్!! అఖిల్ బాగా పెంచేశాడండీ
X
అసలు తన తొలి సినిమా మొదలవ్వకముందు.. అఖిల్ అక్కినేని ని చూస్తే మాత్రం బాగా సన్నగా ఉన్నాడు హీరోలా సెట్టవుతాడా అన్నారు చాలామంది. కాని ''అఖిల్'' సినిమా మొదలయ్యేసరికి అసలు అఖిల్ స్వరూపమే మారిపోయింది. తన కొత్త రూపంతో అందరినీ షేకిచ్చాడు. అయితే రెండో సినిమాకు ఎలా ఉండబోతున్నాడో తెలుసా?

జస్ట్ మరో మూడు నాలుగు వారాల్లో అఖిల్ రెండో సినిమాను లాంచ్ చేయబోతున్నారు. హీరోలన్నాక పెంచకపోతే ఎలా? అలాగే అనుకున్నాడేమో తెలియదు కాని.. ఇప్పుడు అక్కినేని యువకిశోరం మాత్రం తన కొత్త లుక్కుతో పిచ్చ కిక్కిస్తున్నాడు. 'ప్రేమమ్' ఆడియో ఫంక్షన్లో అన్నయ్య చైతూకు విషెస్ చెప్పడానికి విచ్చేసిన అఖిల్.. కాస్త బలంగా, బొద్దుగా, బరువుగా.. ఒక కండలవీరుడు తరహాలో కనిపించాడు. ఖచ్చితంగా ఈ కొత్త కండలవీరుడి కొత్త కండలు మరి తన రెండో సినిమా కోసమే అని వేరే చెప్పక్కర్లేదుగా.

'మనం' మూవీ ఫేం విక్రమ్.కె.కుమార్ డైరక్షన్లో అఖిల్ తన రెండో సినిమా చేయబోతున్నాడని ఆ మధ్యన స్వయంగా కింగ్ నాగార్జున ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా తాలూకు ముహూర్తం షాట్ ఈవెంట్ కూడా జరగనుందట. అది సంగతి.