Begin typing your search above and press return to search.

ట్రైలర్‌ టాక్‌: అఖిల్‌ అదరగొట్టేశాడబ్బా..

By:  Tupaki Desk   |   20 Sept 2015 10:20 PM IST


అమ్మో డ్యాన్సులు ఎలా చేస్తాడో.. ఫైట్లు ఎలా చేస్తాడో.. డైలాగులు ఎలా చెప్తాడో.. స్టయిల్‌ ఎలా ఉంటుందో.. ఇలాంటి డౌట్లన్నింటికీ ఇక ఖేల్‌ ఖతమ్‌ దుకాణ్‌ బంద్‌ అనాల్సిందే. ఎందుకంటే ఒక్క దెబ్బకి ఉతికి ఆరేశాడు అక్కినేని వారసుడు.

''అఖిల్‌'' సినిమాతో వివి వినాయక్‌ డైరక్షన్‌ లో తొలిసారిగా హీరోగా తెలుగు తెరపై అడుగుపెడుతున్న అక్కినేని అఖిల్‌ తన మ్యూజిక్‌ లాంచ్‌ రోజునే ట్రౌలర్‌ తో కూడా విచ్చేశాడు. ఈ సినిమాలో మనోడు ఏం చేశాడనేది ఒక్క ట్రైలర్‌ లోనే చూపించేశారు. అసలు వినాయక్‌ అంటేనే హీరోయిజం. దానికి ఏ మాత్రం తగ్గకుండా మనోడు అఖిల్‌ ను ఒక స్పార్కులాగా ఇంట్రొడ్యూస్‌ చేశాడు. ఇక అఖిల్‌ చేసిన డ్యాన్సులు, పేల్చిన డైలాగులు బాగున్నాయి.

అంతేకాదు.. ఓవరాల్ గా ఆఫ్రికా ఖండంలోని జుయా తెగకు సంబంధించిన కథగా ఈ సినిమాను వినాయక్‌, రైటర్‌ వెలిగొండ శ్రీనివాస్‌ మలిచిన తీరు అదరిందని ట్రైలర్‌ చూస్తే అర్ధమవుతోంది. అనూప్‌ రూబెన్స్‌ కొట్టిన పాటలతో పాటు, థమన్‌ అందంచిన రెండు సాంగ్స్‌ కూడా బాగున్నాయ్‌. మొత్తానికి అన్నీ కలగలసిన ఒక సూపర్బ్‌ ట్రీట్‌ ను దర్శకుడు వినాయక్‌ తో కలసి అందించాడు నిర్మాత.. హీరో నితిన్‌.

ఈ రేంజులో డెబ్యూ ఉంటే ఇక సినిమా అదరిపోవడమే మరి. అక్టోబర్‌ 22న సినిమా రిలీజ్‌ అవుతోంది. అది సంగతి.