Begin typing your search above and press return to search.

అఖిల్ కొత్త తమిళ ట్రైలర్ సూపర్బ్

By:  Tupaki Desk   |   4 Nov 2015 3:12 PM IST


అక్కినేని అఖిల్ నటించిన అఖిల్ కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే.. ఈ సారి తెలుగు వెర్షన్ కి కాకుండా.. తమిళ వెర్షన్ అయిన సూర్య కవచం ట్రైలర్ లాంఛ్ చేసింది యూనిట్. సాధారణంగా మల్టీలింగ్యువల్ సినిమాలకు అన్నీ భాషల్లోనూ ఒకే ట్రైలర్ కట్ చేయడం ఇప్పటివరకూ ఆనవాయితీ. దీన్ని బ్రేక్ చేస్తూ.. సూర్యకవచంకు కొత్త ట్రైలర్ రిలీజ్ చేయడం విశేషం.

తెలుగులో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తే.. వీటికి తోడు ఫ్యామిలీ రిలేషన్స్, కామెడీ సన్నివేశాలు ఎక్కువగా ఉండేలా తమిళ్ ట్రైలర్ ని కట్ చేశారు. దీంతో హోమ్ లీ అఖిల్ ఎలా ఉంటాడో వెల్లడైపోయింది. కుటుంబంలో క్యూట్ కలిసిపోతూ ఆకట్టుకుంటున్నాడు అఖిల్. తెలుగులో రిలీజ్ చేసిన అఖిల్ ట్రైలర్ కు అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. కానీ.. తమిళ సూర్యకవచంకు ఇచ్చిన ట్రైలర్ మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా సూపర్బ్ గా ఉంది.

డబ్బింగ్ వెర్షన్ కూడా చాలా అద్భుతంగా, క్వాలిటీతో ఉండడం విశేషం. ఈ మూవీకి రీసెంట్ గా కమల్ హాసన్ విషెస్ చెప్పడంతో.. కోలీవుడ్ లోనూ అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాదు.. గ్రాఫికల్ వర్క్ ఆధారంగా వచ్చిన టాలీవుడ్ మూవీస్ బాహుబలి - రుద్రమదేవిలు తమిళనాట సంచలన విజయం సాధించాయి. ఇప్పుడు అఖిల్ లోనూ ఇదే మ్యాజిక్ రిపీట్ కానుందనే అంచనాలు ఉండడంతో.. తమిళ ప్రేక్షకులు కూడా అఖిల్ కోసం ఎదురుచూస్తున్నారు