Begin typing your search above and press return to search.

‘కుమ్ముడు’తో.. అఖిల్.. హిమాన్ష్ ఎంజాయ్

By:  Tupaki Desk   |   11 Feb 2017 5:51 PM IST
‘కుమ్ముడు’తో.. అఖిల్.. హిమాన్ష్ ఎంజాయ్
X
ఉప్పల్ స్టేడియంలో జరిగిన భారత్.. బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో ఆసక్తికర అంశాలకు కొదవ లేదు. ఓపక్క గ్రౌండ్ లో కోహ్లీ ఇరగకుమ్ముడుతో స్టాండ్ లో ఉన్న ప్రేక్షకుల ఆనందోత్సాహాలకు అంతే లేకుండాపోయింది. హైదరాబాద్ లో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ ను చూసేందుకు క్రికెట్ ప్రేమికులే కాదు.. ప్రముఖులుకూడా హాజరయ్యారు.

బంగ్లాదేశ్ బౌలర్లను దారుణంగా శిక్షిస్తూ.. పగలే చుక్కలు చూపించిన కోహ్లీ డబుల్ సెంచరీ సాధించిన వైనం అందరి మనసుల్ని దోరుకుంది. ఈ మ్యాచ్ ను చూసేందుకు యూత్ మనసుల్ని కొల్లగొట్టే అక్కినేని అఖిల్ స్పెషల్ అట్రాక్షన్ కాగా.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనమడు.. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు తన ఫ్రెండ్స్ తో స్టేడియంకు వచ్చిన ఎంజాయ్ చేశారు.

కోహ్లీ డబుల్ సెంరీ సమయంలో.. వారంతా ఆనందోత్సాహాలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జాతీయ పతాకాల్ని ఉత్సాహంగా ఊపుతూ.. కోహ్లీ డబుల్ సెంచరీకి ఎంజాయ్ చేసిన తీరు స్టేడియంలోని పలువురి దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్లకు 687 పరుగుల భారీ స్కోర్ చేయటం తెలిసిందే.